ఆంధ్రకు అన్యాయం

19 May 2016


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి రాజకీయ వ్యవహారశైలి కారణంగా ఐదుకోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాడు ‘రెండు కళ్లు’, ‘సమన్యాయం’ అంటూ…23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ విభజనను కోరుకుంటూ లేఖల మీద లేఖలు పంపారే కానీ, విభజన ముసాయిదా రూపకల్పనకోసం నాటి యుపీఏ సర్కారు నిర్వహించిన ఏ సమావేశంలోను ఆయన పాల్గొనలేదు. ఐదులక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ కావాలని ఓ పేపర్ స్టేట్‌మెంట్‌తో సరిపుచ్చారు.

ఇక భాజపా సంగతి సరేసరి. పరిశ్రమల స్థాపనకోసం నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని రాజ్యసభలో నాడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న నేటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను గట్టిగా డిమాండ్ చేశారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా విషయం కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో పట్టలేదని డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారు.

దేశవ్యాప్తంగా యుపిఎ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో, భాజపాతో జట్టుకట్టిన చంద్రబాబు ఎన్నికల్లో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో విజయం సాధించగలిగారు. అయితే పదవీ స్వీకార ప్రమాణం చేసిన దగ్గరినుంచి నేటి వరకు ‘అడ్డగోలుగా విభజించారు’, ‘ఇష్టానుసారం చేశారు’ అంటూ కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. కాలచక్రంలో రెండేళ్లు గడిచిపోయాయి. మిగిలింది ఏమిటి?

బాబు, రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేగలిగారా? నిరుద్యోగభృతి ఇవ్వగలిగారా? రాష్ట్ర ప్రజలందరికీ శుద్ధి చేసిన తాగునీరు ఇవ్వగలుగుతున్నారా? ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారా?ఎన్నికల్లో కులాలవారీగా ఇష్టారీతిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 వైద్యసేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ప్రజారంజక పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. అక్రమాలు జరిగాయని ప్రచారం చేసి ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారుల నోట్లో మట్టి కొట్టారు. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్‌కు మొక్కుబడి నిధులు కేటాయించడమే కాకుండా అవికూడ సక్రమంగా అమలు చేయడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటా వైఫల్యాలే కనిపిస్తాయి.

విభజనచట్టం ద్వారా రాష్ట్రానికి ఒనగూడే ప్రయోజనాలు, నాడు కేంద్ర ప్రభు త్వం తరపున ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా కేటగిరి, ఆర్థికలోటు భర్తీ వీటినైనా సాధించగలిగారా? కృష్ణా, గోదావరి మిగులు జలాలు రాష్ట్రానికి దక్కనీయకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నా దీటుగా స్పందించారా? ఏమీ లేదు.

రాజధాని పేరుతో గుంటూరు-కృష్ణా జిల్లాల మధ్య మూడు పంటలు పంటే వేలాది ఎకరాల భూములను నయానా, భయానా లాగేసుకొని రియల్ ఎస్టేటర్ అవతారం ఎత్తారు

పెట్టుబడుల పేరుతో విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. పాలనాపరంగా మంత్రులపై, అధికార్లపై సీఎంకు పట్టు లేదు. ప్రభుత్వ యంత్రాం గం ఆసాంతం అవినీతిమయమైపోయింది. ప్రభుత్వ విధుల్లో అధికార పార్టీ పెద్దల జోక్యం మితిమీరిపోయింది. టీడీపీ కార్యకర్తలు దళారుల మాదిరిగా వ్యవహరిస్తున్నారు.

మరోపక్క ప్రధాన ప్రతిపక్షాన్ని మానసికంగా దెబ్బతీసేందుకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ప్యాకేజీలను ఇస్తూ మరీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పేస్తున్నారు.

రాష్ట్ర హక్కుల సాధనకు దృఢవైఖరి తీసుకోరెందుకని?
ఓటుకు నోటు కేసు సహా, ఇతరత్రా చెప్పుకోలేని బలహీనతల వల్ల కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారా?

ఇటీవలి కాలంలో టీడీపీ-బీజేపీల మధ్య మిత్రభేదం బయటపడుతోంది. బాబుపాలన పారదర్శకంకగా లేదని, కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పడంలేదని భాజపా నాయకులు బహిరంగాంగానే విమర్శిస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదంటూ స్వయానా ముఖ్యమంత్రే మెల్లమెల్లగా స్వరం పెంచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయడం వల్ల రాజకీయంగా తమకొరిగేదేమీ లేదని, ఫలాలన్నీ టీడీపీనే నొక్కేస్తున్నదని, భాజపా అగ్రనాయకత్వం భావిస్తోందా?

తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీకి దిగలేమని భావిస్తున్నారా? అందుకే టీడీపీని పొమ్మనలేక పొగపెడుతున్నారా?

Now future of the five crores peoples is in Chandrababu Hand. But he is doing political dramas. He not getting special status form BJP. No funds form Central government.