ఛలో అమరావతి

6 May 2016


కానీ..షరతులు వర్తిస్తాయట ఇదీ ఉద్యోగుల వాదన, విజయవాడ గుంటూరులో తమ పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు దొరకడంలేదని వాపోతున్నారు. ఓ రకంగా ఇది వ్యక్తిగత, సామూహిక సమస్యే. కానీ నిజంగా అడ్మిషన్లు దొరకనంత దారుణ పరిస్థితులేం లేవ్, కాకపోతే ఖచ్చితంగా మాకు ఈ స్కూల్లోనే కావాలి అని పర్టిక్యులర్ గా ఉంటే తప్ప. మరో సంగతి, అద్దెల సంగతి, డిమాండ్ ఉన్న చోట సప్లైకి ఎక్కువే పెట్టాల్సి ఉంటుంది. ఆ మాటకి వస్తే హైదరాబాద్ లో అద్దెల సంగతి కూడా ఆలోచించుకోవాలి సిటిలో అద్దెలతో పోల్చితే విజయవాడ గుంటూరులో అంత అద్దె భరించలేమంటున్నారు కానీ, అదే హైదరాబాద్ అనుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఇళ్లలోకి మారిపోతారు. చిక్కల్లా ఇదేదో ఏ సౌకర్యాలు లేని మారు మూల ప్రాంతంలా భావిస్తూ. అక్కడికేదో త్యాగాలు చేస్తున్నట్లు భావించడంలోనే..!

నిన్న మొన్నటిదాకా సొంత ఊరు గ్రామం అనుకోవడం వల్ల అద్దెలు ఎక్కువ అనుకుంటున్నారు కానీ, అదే హైదరాబాద్ లో ఓ ప్రాంతం అనుకుంటే, ఇళ్ల అద్దెల మాట మాట్లాడరు కదా..! వాటర్ కేన్ పాతిక ముఫ్పైరూపాయలకు కొనక్కర్లేదు, కూరగాయలు ప్రతీదీ కేజీ 20పైన ఉండవ్, అలానే సినిమా టిక్కెట్లు 70 కి మించి లేవు, రెస్టారెంట్లలో ఆహారపదార్ధాలు 120 లోపే ఉంటాయ్. ఇలా కొన్ని అంశాల విషయంలో రాజధాని అయినా కానీ, హైదరాబాద్ తో పోల్చితే తక్కువకే దొరుకుతాయ్. ట్రాన్స్ పోర్టేషన్ కూడా తక్కువ రేటే, హైదరాబాద్ లో మినిమమ్ 30 రూపాయలు లేనిదే ఆటో కదలదు మరి అదే 30 రూపాయలతో విజయవాడ అంతా చుట్టెయ్యొచ్చు. ఐనా కేపిటల్ సిటీలో ప్రారంభంలోనే అద్దెలు అంత ఎక్కువ అన్పిస్తుండొచ్చు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అడుగుతున్నారేమో, ఓరకంగా  ఈ రేట్లు పెరుగుట విరుగుట కొరకే లా రేపొద్దున్న అన్నీఖాళీ బోర్డులే కన్పించే స్థితి వస్తుందేమో చూడాలి, ప్రవేట్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదు కాబట్టి జనం మైండ్ సెట్ మారాలి అని కోరుకోవాలి తప్ప మా అద్దెలు కూడా ప్రభుత్వమే కట్టాలన్నట్లు మాట్లాడటం తగదు.

Chandrababu Naidu ordered employees who are in Hyderabad must come to Vijayawada upto July. But employees are not showing interest to come to Vijayawada. They telling about their children school admission, house rents.