పవన్ కి వర్మకి ఎందుకు చెడిందంటే !

11 Apr 2016


పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో చతికిలబడ్డాడని రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ గానే ట్విట్టర్లో రెచ్చిపోతుంటే లాభం లేదనుకున్నాడో ఏమో కానీ, పవన్ కూడా ఆయనపైకి డైరక్టైపోయాడు. ఇలాంటివాళ్లను నేను పట్టించుకోనంటూ ఎటాక్ చేశాడు. అసలు నా రేంజ్ ఏంటో నాకు తెలుసు, మధ్యలో ఈ సత్రకాయ్ గాళ్లెవరు నన్ను డిసైడ్ చేయడానికి అన్నట్లు కామెంట్స్ చేశాడు. సినిమా ప్రమోషన్ లో ప్రతీ మీడియాను దగ్గరకు పిల్చుకుని ఇండైరక్ట్ పబ్లిసిటీ తెచ్చుకుంటున్న పవన్ కల్యాణ్, మీడియా ఆర్జీవీ చేస్తున్న ట్వీట్లపై స్పందించమని అడగగానే, అసలు వర్మకి పవన్ కి ఎందుకు చెడిందో చెప్పుకొచ్చాడు. తనతో సినిమా చేయనందుకే ఇలా ఆర్జీవీ రెచ్చిపోతున్నట్లు పరోక్షంగా చెప్పాడు పవన్.

ఎప్పుడో ఇరవైఏళ్లక్రితం వైఫ్ ఆఫ్ వరప్రసాద్ అనే సినిమా కథ పవన్ కి ఆర్జీవీ చెప్పాడట. ఐతే పవన్ దానికి నో చెప్పినందుకే ఇలా చేస్తున్నాడేమో అనే డౌట్ పవన్ వ్యక్తం చేశాడు. అందరూ అనుకుంటున్నట్లే పవన్ కూడా వర్మ మిగిలినోళ్ల సినిమాలపై పెట్టే శ్రద్ద తన సినిమాలపై పెడితే బావుంటుందని చెప్పాడు. పైగా సెక్యూరిటీ లేకుండా విజయవాడకి వెళ్లమని ఇండైరక్ట్ వార్నింగ్ ఇవ్వడం చూస్తే పవన్ రాంగోపాల్ వర్మ కామెంట్లపై ఎంత సీరియస్ గా ఉన్నాడో తెలిసిపోతోంది. ఇది చూసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మా బాస్ భలే బుద్ది చెప్పాడు వర్మకి అని సంబర పడుతున్నారు. మరిప్పటికిైనా వర్మ మెగా బ్రదర్శ్ ని వదిలిపెడతాడో, నా ట్వీట్లు నా ఇష్టమని ఇంకాస్త రెచ్చిపోతాడో చూడాలి.
Ramgopal Varma is always hot topic in media with his twits. Recently he twitted about Pavan Kalyan. For that Pavan gave counter and told, why he is doing like this.