కేంద్ర మంత్రి గ్రీన్ టీ కాస్టెంతో తెలుసా?

15 Apr 2016


కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు గ్రీన్ టీ తాగే అలవాటుంది. ఆయన ఎక్కడకు వెళ్లినా గ్రీన్ టీనే తాగుతారు. కర్ణాటకకు చెందిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేసినప్పడు కూడా అక్కడ అప్పుడప్పుడు గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే, ఆయన అలా తాగిన గ్రీన్ టీ విలువెంతో తెలుసా? నెలకు 4 లక్షలు. అవును మార్చి నెలలో ఆయన కెంపె గౌడ విమానాశ్రయంలో తాగిన గ్రీన్ టీ కి అధికారులు 4 లక్షలకు బిల్లు పెట్టారు. అది చూసి మంత్రి గారు షాక్ తిన్నారట.

ఎలాంటి స్టార్ హోటల్లోనైనా కూడా గ్రీన్ టీ ఖరీదు 200.. మహా అయితే 300 కి మించదు. సదానంద గౌడకు కర్ణాటక ప్రభుత్వం కేటాయించిన ప్రోటోకాల్ ఆఫీసర్లు మాత్రం ఏకంగా 4 లక్షలకు బిల్లు పెట్టేశారు. కేంద్ర మంత్రులు విమానం ఎక్కి ఢిల్లీ బయలుదేరే వరకు వారికి కావలసినవి ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రోటోకాల్ అధికారులది. అయితే వారు చేతివాటం చూపిస్తున్ఆనరని సదానంద గౌడ గుర్తించారు. “నేను గ్రీన్ టీ మాత్రమే తాగుతా, అది మహా వుంటే 150 రూపాయలుంటుంది. ఈ నెల బిల్లు చూస్తే నాలుగు లక్షలు వచ్చింది. అంటే, అక్కడి ప్రోటోకాల్ ఉద్యోగులు తప్పుడు బిల్లులు పెట్టి ఎలా మోసం చేస్తున్నారో చూడండి” అంటూ మండిపడుతున్నారు.

మంత్రి సదానందకే కాదు మరో ఇద్దరు, ముగ్గురు మంత్రుల ఖాతాలకు కూడా ఇలాగే మూడు, నాలుగు లక్షల్లో బిల్లులొచ్చాయట. దీంతో సీరియస్ గా తీసుకున్న కేంద్ర మంత్రులు ఈ కుంభకోణంపై విచారణ జరిపించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. కాగా, గతంలో ఈ బిల్లులు 35 నుంచి 40 వేల మధ్యలో ఉండేవి. దాంతో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. అవి ఒక్కసారిగా ఇలా లక్షల్లోకి మారిపోవడంతో అధికారుల వ్యవహారంపై కేంద్రమంత్రులు సీరియస్ అవుతున్నారు.
Recently central minister Sadaananda Goud went to Bangalore. There he he drank green tea, protocol officers submitted 4 lacks bill.