కలసి తిరిగితే అంతేనా

3 Apr 2016


నందమూరి హరికృష్ణ, కొడాలినాని ఈ ఇద్దరూ ఇవాళ వార్తల్లో వ్యక్తులయ్యారు. విజయవాడలో పశువుల ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఈ ఇద్దరూ కలిసి హాజరవడంతో నానిటిడిపిలోకి జంప్ అవుతారని, కాదు నందమూరి హరికృష్ణే  వైఎస్సార్సీపితో టచ్ లోకి వచ్చారని పుకార్లు వచ్చాయ్. అసలు నాని పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వకముందునుంచీ ఎన్టీఆర్ కి ఫ్యాన్, జూనియర్ ఎన్టీఆర్ కి రూట్ మ్యాప్ గీసింది మనోడేనంటారు. హరికృష్ణకి కూడా బాగా క్లోజ్ గా చెప్తారు. అందుకే పార్టీలో ఉన్నప్పుడూ లేనప్పుడూ కొడాలి వెంకటేశ్వర్రావనే ఈ ఎమ్మెల్యే హరికృష్ణ ప్యామిలీతో సన్నిహితంగా, నారా చంద్రబాబుతో దూరంగా మెలుగుతుంటాడు. 

ఐతే ఇప్పుడు నాని చెప్తుంది, పశువుల ఆస్పత్రికి ఎన్టీఆర్ పేరు పెట్టారని, తన సన్నిహితుడు ఓపెన్ చేస్తున్నాడు కాబట్టే వెళ్లానని చెప్పారు. ఇది జంప్ జిలానీల టైమ్ కాబట్టి కొడాలి నాని టిడిపిలోకి వెళ్లారంటే నమ్మటానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఐతే మనోడి రఫ్ బిహేవియర్ కి ఇలా చాటుగా ముసుగేసుకుని కాకుండా డైరక్ట్ గానే పార్టీలోకి వెళ్తాడని కూడా కొందరు అంటున్నారు. పైగా నిన్నగాక మొన్న అసెంబ్లీలో చంద్రబాబును వేస్ట్ ఫెలో సార్, ఎన్టీఆర్ ని చంపేశార్ సార్ అంటూ నోరు పారేసుకుని ఎలా టిడిపిలోకి వెళ్తాడో అని లాజిక్కులు లాగుతున్నారు కూడా..!
In Vijayawada for veterinary hospital opening YSRCP MLA Kodali Nani and Balakrishna attended jointly. So they both are hot topic in media, Nani again joining into TDP.