ఇది నిజమేనా

4 Apr 2016


ఊపరి సినిమా టైటిల్ తనదే అయితే అది నాగార్జున కోసం రాజారవీంద్ర ఇచ్చేసాడని ఓ కథనం విన్పిస్తోంది. అందులో మంచి క్యారెక్టర్ ఇస్తాననే సరికి రాజారవీంద్ర ఆ టైటిల్ ఇచ్చేసాడనేది ఆ కథనం సారాంశం. ఐతే సినిమాలో మనోడి క్యారెక్టర్ అసల్లేదని దీనిపై రాజారవీంద్ర తెగ ఫీలౌతున్నాడంటున్నారు. అసలు నిజంగా టైటిల్ కోసమే  అయితే నాగార్జున కానీ, పివిపి కానీ డబ్బులిచ్చి టైటిల్ తీసుకోవడం పెద్ద విషయం కాదు, కనీసం 50 లక్షలైనా పెట్టి కొంటారు దానికోసం అవసరం లేకపోయినా ఓ క్యారెక్టర్ క్రియేట్ చేయడం, లేదంటే షూటింగ్ చేసిన క్యారెక్టర్ ని తొలగించడం చేయరు. ఓ వేళ ఆయన వాదన నిజమే అయినా, ఈ ఊపిరి టైటిల్ తో వడ్డే నవీన్ ఓ సినిమా తీసాడు. అదే నా ఊపిరి, మానసిక వ్యాధితో బాధపడే క్యారెక్టర్ లో నవీన్ అందులో కన్పిస్తాడు. తమిళ డైరక్టర్ కన్మణి దానికి దర్శకత్వం వహించాడు.

అలానే ఊపిరి టైటిల్ కి పైన చిన్న అక్షరాలతో నాగ్ ఊపిరి అని రిలీజ్ చేస్తే ఏమయ్యేది. అంత ఆలోచించకుండా నిర్మాతలు నాగార్జున ఇలా రాజారవీంద్రని మోసం చేసారని అనుకోలేం. ఐనా అంత తెలివితక్కువగా ఓ క్యారెక్టర్ ఇస్తే టైటిల్ ఇచ్చేసాడని అనుకోలేం. ఎందుకంటే ఇంతవరకూ ఆయన ఉన్న సినిమాల్లో ఆయన పాత్ర కానీ, అబ్బ రాజారవీంద్ర ఏం చేశాడ్రా అనే స్థాయి కానీ అతనికి లేదు. ఇది కాకుండా ఇంకేదో జరిగి ఉండాలి, అది చెప్పుకోకుండా బైటికి ఇలాంటి కథనాలు పంపిస్తున్నాడంటున్నారు.
Narjuna Akkinen present movie Oopiri is biggest hit. But rumors about that movie is hot topic in industry. This title is Rajaravindra's, he gave it for a role in this movie.