పవన్ దారేది

12 Apr 2016


నెల గడవడం కష్టంగా ఉంది. ఈ మాట ఏ మీడియాలో పని చేసే జర్నలిస్టో, గిట్టుబాటు ధర దొరకని రైతో మాట్లాడితే అర్ధం ఉంటుంది. లేదంటే తెలుగు ప్రభుత్వాల్లోని కాంట్రాక్టు ఎంప్లాయీలు అంటేనో సరిపోతుంది, కానీ కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కల్యాణ్ అనడంలో ఔచిత్యమేంటి. పైగా తన స్టాఫ్ కి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నా అని వాపోయాడాయన. అంటే ఓ రకంగా వాళ్ల జీతాలు లక్షల్లో ఉండాలి, ఆయన ఎంత అబద్దం ఆడాడో అత్తారింటికి దారేది నిర్మాత భోగవల్లి ప్రసాద్ ని అడిగితే చెప్తాడు. ఆయన తనకి ఇవ్వాల్సిన మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం లేదంటూ నాన్నకు ప్రేమతో రిలీజ్ కు ముందు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మరి బాకీనే అంత  ఉంటే అసలు రెమ్యునరేషన్ ఎంత ఉండాలి, సరే అది వదిలేద్దాం. నా ఇమేజ్ నాకు తెలుసు ఇంకోళ్లు ఎవరు నిర్ణయించడానికి అంటాడాయన. మరి మిగిలిన నేతలపై విరుచుకుపడటానికి ఆయన అర్హతలేంటో మాత్రం తెలుసుకోవద్దా. పైగా పార్టీని తప్పకుండా పోటీలో నిలబెడతానంటూనే నా దగ్గర అస్సలు డబ్బు లేదంటాడు. ఇది దేనికి సిగ్నల్, తాను పార్టీ రన్ చేస్తా కానీ, ఫండ్స్ ఎవరైనా ఇస్తే తీసుకుంటా అనా..? లేక 2014 ఎన్నికలకు ముందు బాబుతో బేటీ అయి ప్యాకేజీ పాలిటిక్స్ మరోసారి నడపడానికి రెడీ అవుతున్నాడా..? ఈ లెక్కన పవన్ కాపుసంఘాలకు ఓపెన్ ఆఫరిచ్చినట్లే అనుకోవాలి. కులం ప్రస్తావన తీసుకురావద్దనే పవన్ కల్యాణ్ తన అభిమానసంఘాల్లో ప్రసిడెంట్లు, నేతలు ఏ కులపోళ్లే చెప్పగలరా..?

పవన్ కల్యాణ్ ఏం చేసినా ఓ డ్రామా ఉంటుంది. డబ్బు సంపాదించడం తప్పు కాదు, దొంగపనులు, చట్టవ్యతిరేక పనులు చేస్తే తప్పు అలానే. తిరుపతి సభలో పెద్ద వర్షం పడుతుంటే ఓ గొడుగు పట్టుకుని నిల్చోవచ్చు. అలా కాకుండా ఏదో గొప్ప త్యాగం చేసేవాడిలా అలా తడుస్తూ ఆయన జనానికి ఏం సంకేతం ఇవ్వదలిచాడు. జనం తడుస్తుంటే నేనెందుకు గొడుగు పట్టుకోవాలి అనేనా..? అలాంటప్పుడు ఇప్పుడు జనం పడుతున్న కష్టాలు (ఇవి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉంటాయి) ఆయన కూడా పడాలి కదా, తాను మాత్రం హాయిగా సినిమాలు తీసుకుంటూ పైగా అదేదో కష్టమైన పనైనట్లు (ఇది కూలోడి కష్టం కాదు కదా) బిల్డప్ ఇస్తూ ఇంటర్వ్యూలు ఎందుకు. ఇప్పుడు హఠాత్తుగా ఆయనకి తెలుగు మీడియాపై ఎందుకు ప్రేమ పుట్టిందంటే, సర్దార్ గబ్బర్ సింగ్ పై విపరీతమైన డివైడ్ టాక్ వచ్చినందుకే అని చిన్నపిల్లాడికైనా తెలిసిపోతుంది.

పైగా నేనింక సినిమాలు తీయను అంటూ సెంటిమెంట్ పూసే ప్రయత్నం చేసినా, సినిమా ఫ్లాప్ అవకుండా అవేవీ అడ్డుకోలేకపోయాయ్. సినిమాలు తీస్తాడో, తీయడో ఎవడికి పట్టింది. ఎఁదుకంటే ఇవాళ్టి రోజున ఓ హీరో పోతే, మరో హీరో వెంటనే ఆ ప్లేస్ లో ఇరుక్కుంటున్నాడు. పైకి లేచినంత టైమ్ పట్టదు కింద పడటానికి. అందుకే ఈయన దారేదని ఆయన ఒక్కరికి తప్ప ఇంకెవరికీ తెలియదు.
Pavan Kalyan recent interview creating fun. He is saying i dont have money. Even i am not paying money to my staff.