ఇదో రకం కుటీర పరిశ్రమ

13 Apr 2016


పాడి ఆవులుంటే చాలు కుటుంబాలు కళకళలాడుతుంటాయ్ అనేది ఒకప్పటి నమ్మకం. నిజంగా కూడా పాల వ్యాపారం చేసేవాళ్ల ఆర్ధిక స్థితి మెరుగ్గానే ఉంటుంది. ఐతే అది అందరూ చేయలేరు, మేత తేవాలి, పశుపోషణ చేయాలి. కానీ ఇవేవీ లేకుండానే రోజుకి వేలకి వేలు సంపాదించడం ఎలానో ఓ ప్రబుద్దుడు నేర్చుకున్నాడు. హైదరాబాద్ సిటీ యాప్రాల్ ఏరియాలో కృష్ణయాదవ్ అనే వ్యక్తి రోజూ 400 లీటర్ల పాల వ్యాపారం చేస్తుంటాడు, కనీసం 8వేల రూపాయల సంపాదన ఉంటుంది. ఐతే మనోడిపై ఎందుకో లోకల్ పీపుల్ కి డౌట్ కొట్టింది. సైబరాబాద్ పోలీసులకు  ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 

అతని ఇంట్లో సోదాలు చేస్తే అవాక్కయ్యే నిజాలు తెలిసాయ్. ప్రతి రోజూ పాలపొడి ప్యాకెట్లు కొనడం, నీళ్లు కలిపి పాలు తయారు చేయడం, వాటిని పాల కేంద్రాలకు, చుట్టుపక్కలవాళ్లకి సరఫరా చేయడం మనోడి కుటీరపరిశ్రమగా తెలిసింది. ప్రస్తుతం జవహర్ నగర్ పోలీసులు కృష్ణాయాదవ్ బెండు తీసే పనిలో పడ్డారు. అందుకే కాస్త గమనించాల్సిందేంటంటే తెల్లనివే కాదు ప్యాకెట్లో వచ్చేవన్ని పాలు కాదు.
Once upon a time milk is very good business in Villages. They take milk from cows and she-buffalo andf sell it. Now a man was caught by polices. He making milk with powder and selling.