ఆలయం లో విషాదం

11 Apr 2016


కేరళ లో పెను ప్రమాదం లో ఘోర విషాదం సంభవించించింది. కొల్లం జిల్లా పరపూర్‌లో పుట్టింగల్‌ దేవీ ఆలయ ఉత్సవంలోఫైర్ వర్క్స్ పెల్చుతుండగా 110 మంది దుర్మరణం చెందారు. ఇంకా 400 మందికిపైగా గాయాలు అయ్యాయి. ఈ ఆలయ వేడుకల్లో భాగంగా బాణా సంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఇవాళ ( ఆదివారం ) తెల్లవారుజామునభాణా  సంచా కాల్చారు. అయితే అనూహ్యం గ మంటలు చెలరేగి భక్తులపై పడటం తో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. గాయపడ్డవారిని  తిరువనంతపురం వైద్య కళాశాల ఆస్పత్రి, కొల్లం ప్రభుత్వ ఆస్పత్రికి పంపి ట్రీట్మెంట్  ఇప్పిస్తున్రు. ఇంకా మరణాలు పెరిగే ప్రమాదం కన్పిస్తుంది. ప్రమాదం జరిగిన గుడిలో , హాస్పిటల్స్ లో దృశ్యాలు చాల ఘోరం గా ఉన్నాయి.

ఆలయం లో ప్రమాదం జరగడానికి మూలా కారణం, గుడి ఎక్కువ చెక్క తో నిర్మించడమే అని అంటున్నారు. ఉత్సవ సమయం కావడంతోపుట్టింగల్‌ దేవీ ఆలయంలో ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది ఓకే చోట ఉండడంతో ప్రాణ నష్టం పెరిగిందని అధికారులు చెప్తున్నారు. భరణి నక్షత్రంలో మీనా భరిణి ఉత్సవాన్ని వైభవంగా వేడుకలు జరుగుతుంటాయట. ఉత్సవానికి ప్రతి ఏడాది చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు వస్తారు.  అగ్ని ప్రమాదం తెలిసిన వెంటనే కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందితోపాటు పలువురు మంత్రులు ప్రమాద స్థలానికి బయలుదేరి వెళ్లరు. ఎన్నికల సమయం లో ఇలా జరగడం కాంగ్రెస్ ని కలవర పెడుతోంది.
Fire accident was happen in Kerala temple. At that crackers are tradition here. Basically this is maximum constructed with wood.