అందుకేనా ఆ రాతలు

11 Apr 2016


కొన్ని రోజులుగా టిడిపి మీడియాగా ముద్ర పడ్డ పత్రికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు సంధిస్తున్నాయ్. జిల్లాలవారీగా ఏ ఎమ్మెల్యే ఎంత దోచుకుంటుందీ, ఎలా దోచుకుంటుందీ లెక్కలవారీగా వివరిస్తుండటంతో పచ్చ ప్రముఖులు అవాక్కవుతున్నారు. ఇదేంటి మన పేపర్లో ఇలాంటి రాతలొస్తున్నాయంటూ ఆశ్చర్యపోతున్నారట. ఐతే ఇందులో భీకరమైన ప్లానుందట, ప్రజాప్రతినిధుల దోపిడీ వెనుక ఎవరో ఒక బిగ్ బాస్ హస్తం లేనిదే ఆ రేంజ్ లో రెచ్చిపోరని అందరికీ తెలుసంటారు. వాళ్లని అడ్డుపెట్టుకుని పెదబాబు, చినబాబులు డబ్బు చేస్కుంటున్నారని.

ఐతే అది బాగా కంపు కొడుతుండటంతో, ఆ మురికి తమకి అంటకుండా ఉండేందుకే బడా ప్లానేసారని. దీంతో తమ ఇమేజ్ కి ఢోకా లేకుండా పని కానిచ్చేస్కోవచ్చని వ్యూహం రచించారట. పైకి పేపర్లు చదివే అమాయకులు మాత్రం అయ్యో మన ఎమ్మెల్యే వీర పీకుడుగాడు కానీ, పైన కూర్చున్న పెదబాబు చాలా నిజాయితీగల్లోళ్లు అనుకోవాలనేది పత్రికల మాస్టర్ ప్లాన్ అంటున్నారు. ఐతే జనం అంత పిచ్చోళ్లు కాదు. ఎవరు వెనుక ఎవరో, చివరికి మిగిలేది ఎవరో వాళ్లకి తెలిసినట్లు ఎవరికీ తెలీదు. టైమొచ్చినప్పుడు అన్నిటికీ కలిపి కసి తీర్చేసుకుంటారు.
Now yellow media writing against TDP leaders and MLAs. All TDP leaders are shocking about this action of yellow media. But all it was done by TDP chief Chandrababu.