ఉత్తరాంధ్రలో ఫ్యాన్ హవా

17 Apr 2016


వలసలు, జంపింగ్ ల నుంచి కాసేపు దృష్టి మరలిస్తే, ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ బలపడుతోంది. టైమ్లీగా వైజాగ్ రైల్వేజోన్ అంశాన్ని అందిపుచ్చుకుని పార్టీ నేత అమర్ నాధ్ చేసిన దీక్షకు అనూహ్యంగా మద్దతు లభిస్తుండటంతో కేడర్ లో ఉత్సాహం జోరందుకుంది. వైసీపీ చేపట్టిన ఈ దీక్షకు ప్రజాసంఘాలతో పాటు ఇతర పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నేప‌ధ్యంలో ప్ర‌జా పోరాటాల ద్వారా పార్టీ మారాల‌నుకునే ఎమ్మెల్యేల‌ని క‌ట్ట‌డి చేయాల‌ని జ‌గ‌న్ బావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏపీలోరైల్వేజోన్,  కరువు పరిస్థితిఫై వైసీపీ నేతలు ఆందోళన బాట‌పట్టారు. రాష్ట్రంలో నెల‌కొన్న క‌రువుపై జ‌రిగే ఆందోళనల్లో పాల్గొనాలని అధినేత జగన్ కూడా నిర్ణయించారు.

కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్ర‌భుత్వం  అశ్రద్ధ వహిస్తుందని భావిస్తున్న వైసీపీ, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన బాట ప‌ట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లు, తహసిల్దార్ కార్యాలయాలు ముందు ఆందోళన చేసెందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 19న తేదీన లోటస్ పాండ్ లో జిల్లా అధ్యక్షులు పార్టీ ముఖ్య నేతలుతో సమావేశం నిర్వహించి, కార్యాచరణ ప్రకటించనున్నారు.

విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్, ఉత్తరాంధ్రవాసుల చిరకాల కోరిక. విశాఖ రైల్వే జోన్ సాధనకోసం దశాబ్దాలుగా ప్రజా సంఘాలు, కార్మికసంఘాలు, రాజకీయపార్టీలు ఆందోళన కొనసాగిస్తునే ఉన్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన దీక్ష వారి ఆకాంక్షకు అనుగుణంగానే ఉండటంతో పార్టీ పట్టు ఉత్తరాంద్రలో పెరుగుతుందని అంచనాలు నెలకొన్నాయ్.
In Andhra Pradesh TDP government is in problem. Now YSRC Party is in from. Special railway zone for Vizag, starvation in AP are the draw backs to TDP.