ఢిల్లీ గల్లీల్లో..!

20 Apr 2016


ఏపిలో పార్టీ ఫిరాయింపుల వ్య‌వ‌హారాన్ని జాతీయ స్ధాయిలో ఎండ‌గ‌ట్టేందుకు ప్ర‌తిప‌క్ష వైసిపి సిద్ధ‌మౌతుంది. పార్టీ ఫిరాయింపులపై మొద‌ట రాష్ట్రంలో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ ఇక ఢిల్లీలో ఈ గలీజు యవ్వారంపై నిలదీసేందుకు సిధ్దమైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌తిప‌క్ష పార్టీ నుంచి అధికార పార్టీకి వ‌ల‌స‌ల ప‌రంప‌ర కొన‌సాగ‌డంపై వైసిపి నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సిఎం చంద్రబాబు కావాలనే ఇలా స్వయంగా ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌కు కండువా క‌ప్ప‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని వైసిపి వాదన. లోట‌స్ పాండ్‌లోని వైసిపి కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర స్ధాయి స‌మావేశం నిర్వ‌హించిన జగన్, ఈ అంశంపై 13 జిల్లాలకు చెందిన  అధ్య‌క్షులు, పార్టీ ప‌రిశీల‌కులతో చర్చించారు.పార్టీ ఫిరాయింపుల చ‌ట్టాన్ని చంద్ర‌బాబు అప‌హాస్యం చేయ‌డాన్ని నిర‌సిస్తూ ఈ నెల 25న సేవ్ డెమోక్ర‌సీ పేరుతో అన్ని జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల‌ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకుంది వైసీపీ.

ఓ వైపు జంప్ జిలానీలపై బాబు పరువు ఎండగట్టడంతో పాటు, జనం సమస్యలపై పోరు చేసేందుకు వైసీపీ ప్లానేసినట్లు కన్పిస్తోంది. ఇప్పటికే మండుతున్న ఎండలతో నోళ్లు తెరుస్తున్న బోర్లు, నీటి సమస్యపై మే2న ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం ప్లానేసింది. ఇది ఖచ్చితంగా విజయవంతమవుతోంది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు లేని ఊళ్లే కన్పిస్తున్నాయ్. టిడిపి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టి రెండు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి ప‌రిపాల‌న‌ను గాలికొదిలేసిన టిడిపి పై వైసీపీ ఖచ్చితమైన ప్లాన్ లోనే వెళ్తుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. 
YSRCP is getting ready to take action against MLAs who jumped into TDP. Now they are planing to go to Delhi Supreme court.