మృత్యుంజయురాలా..? భ్రాంతి పొందిందా

22 Apr 2016


మనిషి ఆఖరి ఘడియలెలా ఉంటాయ్, చనిపోయాక మళ్లీ బతకవచ్చా ఈ ప్రశ్నకు జవాబు అనితా ముర్జానీ. చనిపోయి బతికిన ముర్జానీ అనుభవాలతో రాసిన డయింగ్ టు బి మీ బాగా అమ్ముడుపోతోంది. మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు, ఆత్మకి అనుబంధాలతో ఉండే స్పందనలతో కూడిన డయింగ్ టూ బీ మీ సంచలనం. హిందూ ధర్మశస్త్రాల ప్రకారం మనిషికి  ఆఖరి క్షణాల్లో  పూర్వజన్మ స్మృతులన్నీ గుర్తుకొస్తాయ్. ఆ మనిషి తాలూకూ ఆత్మ ఆ తర్వాత జరిగే తంతుకు సాక్షీభూతంగా ఉంటుందంటారు. ఐతే కొంతమంది మాత్రం తాము చనిపోయామని, తిరిగి శరీరంలోకి వచ్చి చేరామని చెప్తున్న సంఘటనలు వింటుంటాం వాళ్లాసమయంలో నిజంగానే చనిపోయారా, లేక భ్రాంతా. ఐతే అమెరికాకి చెందిన అనితా మూర్జానీ మాత్రం తాను నియర్ డెత్ ఎక్స్ పీరియెన్స్ అంటే చనిపోయానని, ఆ తర్వాత తిరిగి తనంతట తానే తన శరీరంలోకి ప్రవేశించానని చెప్తోంది. అనితా మూర్జానీ అమెరికాలో స్థిరపడ్డ భారతీయసంతతికి చెందిన మహిళ, ఆమె 2006 సంవత్సరంలో కేన్సర్ వ్యాధితో బాధపడింది. నాలుగేళ్లపాటు అలా కేన్సర్ వ్యాధితో పోరాడుతూ, హాస్పటల్ లో ఓ దశలో నాలుగురోజులపాటు కోమాలోకి వెళ్లిపోయిందామె. డాక్టర్లు కూడా ఆమె చనిపోయిందని చెప్పేశారు ఐతే ఇక్కడే కథ పెద్ద మలుపు తిరిగింది.

చనిపోయిందని ఆశలు వదిలేసుకున్న తర్వాత అనితా మూర్జానీ బతకడమే కాకుండా ఆమె కేన్సర్ కూడా వేగంగా తగ్గిపోయింది. ఇది పెద్ద సంచలనానికే దారి తీసింది, ఎందుకంటే అనిత చనిపోయిందని చెప్పిన సమయంలో ఏం జరిగిందో అనిత మొత్తం పూసగుచ్చినట్లు వివరించింది, ఆ తర్వాత అనిత లైఫ్ స్టైల్ మారిపోయింది. తానెలా మృత్యువును జయించి వచ్చిందీ ఆమె ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. ఆమె చనిపోయిందని చెప్పిన తర్వాత అనిత తన బాడీనుంచి బయటకు వచ్చినట్లు చెప్పింది, చుట్టూ ఏం జరుగుతుందో తాను గమనించానని చెప్పింది అనిత, చుట్టూ ఉన్న వాతావరణమే కాకుండా అంతా ఓ కొత్త అనుభవంగా ఉందని అనిత చెప్పింది. తనని ఇంటర్వ్యూ చేసినామెతో స్వర్గం గురించి అనుభవించి తెలుసుకోవాలే కానీ వర్ణించడం కుదరదని అనిత చెప్పింది. చాలామంది అనుకునేలా స్వర్గం లేదని కూడా అన్నదామెతాను చనిపోయిన క్షణంలో ఏమేం జరిగాయో కూడా అనిత చాలా స్పష్టంగా చెప్పడంతో చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారట. తాను చనిపోయిన తర్వాత తన తండ్రి, ఎప్పుడో చనిపోయిన ఫ్రెండ్ కూడా కన్పించారట అనితకు. వాళ్లతో మాట్లాడిన తర్వాతే తిరిగి తన శరీరంలోకి రావడం కుదిరిందని అనిత చెప్పడం ఆశ్చర్యంగా అన్పించకమానదు.

అనిత మూర్జానీ చెప్తున్న విషయాలు నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ నమ్మడానికి మాత్రం ఓ సంఘటన తార్కాణంగా కన్పిస్తోంది. అదే కోమాలో ఉన్నసమయంలో ఓ డాక్టర్ ఆమెకి ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఐతే అతనుకానీ, మిగిలినవాళ్లు కానీ ఆమెకి తెలిసే అవకాశం లేదు ఐతే, కోమానుంచి బైటికి రాగానే సదరు డాక్టర్ ని అనిత అతని పేరు పెట్టి పిలిచిందట, అలా అనిత చెప్పేది వాస్తవమనడానికి అదో నిదర్శనంగా మారింది. అలా కేన్సర్ తో మృత్యువు ముంగిట్లోకి వెళ్లొచ్చిన అనిత మూర్జానీ, తాను చావును జయించానని చెప్తోంది. తనలాగే మిగిలిన వాళ్లు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో మరణభయాన్ని జయించవచ్చని కూడా అంటోంది. వైద్యశాస్త్ర పరంగా ఇది క్లినికల్ డెత్ అనవచ్చు లేదంటే కోమా అని చెప్పవచ్చు. కానీ అలాంటి స్థితిలో ఏం జరిగిందో చెప్పడం ఎలా సాధ్యపడుతుంది. అనిత చెప్పేదాన్ని నమ్మడానికి మరో రుజువు ఫ్లైట్ లో తనని చూడటానికి వస్తున్న సోదరుడిని చూసానని చెప్పడం మరోటి, వాటితో పాటు హిందూ శాస్త్రాల ప్రకారం ఉపప్రాణ స్ధితిలో ఉన్న దేహాల్లోకి జీవుడు తిరిగి వచ్చే అవకాశం ఉందంటారు. ఉప ప్రాణ స్థితి అంటే పంచప్రాణాలు పోయిన స్థితిలోనూ దేహంలో సూక్ష్మంగా ప్రాణం ఉండే స్థితి, ఇది ఓ రకంగా మన దింపుడు కళ్లెం  అని హిందూ ఆచారాల్లో చూస్తుంటాం.
In America an women was wake up after her death. Yes its really she wakeup after death and told her experience in her death.