కెప్టెన్ ధీమా

11 Apr 2016


తమిళనాడు ఎన్నికల్లో రోజులు గడిచే కొద్ది DMDK పార్టీ అధినేత విజయకాంత్ మొహం లో ఆనందం పెరిగిపోతోంది ఎందుకంటే ప్రజకుటమి లో కి ఆరు పార్టిలు చేరడం. గతం లో రాష్ట్రము లో మంచి పట్టున్న పార్టీ అయిన తమిళ మనిన కాంగ్రెస్ -  టీఎంసీ కూడా వచ్చి మద్దతు ప్రకటించడం తో ఈసారి కింగ్.. కింగ్ మేకర్ తనే అవుతానని ఆశల  పల్లకి లో ఊరే గుతున్నాడు. మొత్తం 224 సీట్ల కి డీఎండీకే 104, ఎండీఎంకే 29, టీఎంసీ 26, సీపీఎం, సీపీఐ, డీపీఐ తలా 25 సీట్ల చొప్పున పోటికి దిగడానికి ఒప్పందం కుదిరింది. 

వైగో GK  మూపనార్  కుమారుడు వాసన్ క్రౌడ్ పుల్లెర్స్ గ ప్రచారం చేపట్టబోతుండగా CM కాండిడేట్ గ విజయకాంత్ రంగం లో ఉ న్నాడు. వైగో కూడా ఇక విజయకాంత్ ముఖ్యమంత్రి గ పదవి చేపట్టడమే తరువాయి అన్నట్లుగా ప్రకటనలు గుప్పిస్తుండటం తో కెప్టెన్ ఆనందానికి అంతు లేకుండా పోతోంది. అయితే ఏ మాత్రం సహనం లేకుండా వ్యవహరించడం విజయకాంత్ కి మైనస్ పాయింట్ గ మారుతోంది, కూటమి ప్రచారం లో ను మిగిలిన నేతల కి అవకాసం లేకుండా మాట్లాడటం ఇదే సూచిస్తోంది. అన్నట్లు కూటమి హామీలు చుస్తే మన తెలుగు ఎన్నికలు గుర్తు రాకుండా పోవు.
Tamilnadu is very with elections. Movie artiest Vijayakanth started a party DMDK and formed a group called Praja Kutami. So six parties were joined in this group. So Vijayakanth is very happy.