అగస్టాకష్టాలు

28 Apr 2016


ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ చాపర్ కుంభకోణంపై పార్లమెంట్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రమేయంపై అధికారపక్షం ఆరోపణలు గుప్పించడంతో, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు సభకు తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో పలుమార్లు అంతరాయం మధ్యనే ఉభయసభలూ సాగాయ్. ఐతే ఇది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఎన్డీఏ స్కూప్ లో పడేసినట్లే అవుతుందంటున్నారు.

రెండ్రోజులుగా పార్లమెంట్ లో అగస్టా చాపర్ల కొనుగోళ్లపై ఆరోపణలు గుప్పుమంటున్నాయ్. బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి నేరుగా సోనియాపైనే విమర్శలు చేయడంతో విషయం మరింత వేడెక్కింది. మరోవైపు సోనియాగాంధీ కూడా తనపై ఆరోపణలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. పైగా తామే అగస్టా వెస్ట్ ల్యాండ్ ను బ్లాక్ లిస్ట్ లో పెడితే, బిజెపి దాన్ని రద్దు చేసిందని చెప్పారామె. ఇటలీలోని ఓ కోర్టు ఇదే అంశంపై అగస్టా కంపెనీలోని మైఖేల్ అనే వ్యక్తి ఇండియన్ అధికారులకు, రాజకీయనేతలకు డబ్బిచ్చారని, ఆ ముడుపుల వల్లనే చాపర్ల విక్రయాలు సాధ్యమయ్యాయని తేల్చింది. దీంతో ఇది ఎన్డీఏకి అస్త్రంలా దొరికింది, అందుకే ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కూడా ముడుపులు అందుకుంది ఎవరో తేల్చాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఈ  అంశంపై తాము చర్చకి సిధ్దంగా ఉన్నామని చెప్తోంది. 2010 లో అగస్టాకి సంబంధించిన 12 వెస్ట్ లాండ్ హెలికాప్టర్లను యూపీఏ కొనుగోలు చేసింది. ఐతే దాని హయాంలోనే కొనుగోళ్లపై విమర్శలు, ఆరోపణలు రావడంతో 2013 లో కాంట్రాక్టు రద్దు చేసింది. మొత్తం 3600 కోట్ల రూపాయల విలువైన ఈ క్రయవిక్రయాల  కేసులో  ఇటలీలో కూడా విచారణ  జరుగుతోంది. ఈ నేపధ్యంలో అక్కడ వచ్చిన ఓ తీర్పు నేపధ్యంలో కాంగ్రెస్, ఎన్డీఏ సభ్యుల మధ్య సంవాదం చోటు చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై దాడికి దిగారు. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వం రెండేళ్ల నిద్రపోయి. ఇప్పుడే లేచినట్లుందని చెప్తోంది. రెండు నెలల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి తప్పించుకున్న కాంగ్రెస్, ఇప్పుడు మరోసారి అగస్టా కుంభకోణం బైటికి రావడంతో ఊపిరి తిప్పుకోలేకపోతోంది.
Augusta Helicopter case again came back. In parliament NDA talk about Augusta matter, and commented on Sonia.