నాయికి పాడింది

14 Apr 2016


హీరోయిన్ త్రిష మరోసారి రెచ్చిపోబోతోంది. తెలుగులో పద్దతైన పాత్రల్లో కన్పించిన త్రిష తమిళంలో మాత్రం పొట్టి పొట్టి బట్టల్లో బాగానే యూత్ కి కిర్రెక్కించేది. ఇప్పుడు నాయకి అనే ఓ హార్రర్ మూవీలో నటిస్తున్న త్రిష దానికోసం ఓ పాట కూడా పాడింది. నాయకి కోసం త్రిష పాడిన పాటను డైరక్టర్ పూరీ జగన్నాధ్ రిలీజ్ చేయడమే ఆశ్చర్యం. ఐతే ఇదోరకం జిమ్మిక్కనుకోవాలి. ఈ పాట వీడియా చూసినోళ్లకి త్రిష బాగానే కష్టపడుతుందనుకోవాలి. ఎందుకంటే షార్ట్స్ లో యూత్ ని ఆకట్టుకునేలా కన్పించింది, అదే పూరీ కూడా చెప్పాడు.

లుక్ బావుంది, పాట బావుందంటూ పొగిడేశాడు. బుజ్జిగాడు లో వీరిద్దరి కాంబినేషన్ యావరేజ్ గా పోయింది. నాయకితో రీ ఎంట్రీ కోసం త్రిష బానే కష్టపడుతోంది. పూరీతో ఆడియో సాంగ్ రిలీజ్, తర్వాత నందమూరి బాలయ్యతో ఆడియో ఫంక్షన్, కెరీర్ ని కాస్త ప్లాన్డ్ గా వెళ్తోన్నట్లనిపించకమానదు. ఐతే రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బా, నయనతార కాజల్ లాంటి స్టార్ల హవాకి త్రిష ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.
It is a very long time that trisha movi released. In her second re-entry she is doing Nayaki movie. For this movie she is suffering very much. Now for this movie, she is singing a song. And this song is released by Puri Jaganath.