తమన్ షాకింగ్ స్టేట్ మెంట్

18 Apr 2016


ఎవడైనా డబ్బుకి లోకం దాసోహం అనాల్సిందేనా, అనాలనే మ్యూజిక్ డైరక్టర్ తమన్ అంటున్నాడు. పైగా ఎంత డబ్బిస్తే దానికి తగ్గ క్వాలిటీ సాంగ్స్ లో వస్తుందట. ఇది విచిత్రంగాలేదూ, లేక ఇంకా డీప్ గా చూస్తే నా రేంజ్ అంతా పైనే కింద  అసలు చూడను అని చెప్పడమా. ఆ లెక్కన చూస్తే ఆగడు సినిమా మ్యూజిక్  మరి ఎందుకు ఫెయిల్ అయింది డబ్బులు బాగా ఇవ్వకనేనా..?

ఘంటసాల బలరామయ్య మనవడిగా తక్కువమందికి తెలిసిన ఎస్ ఎస్ తమన్, రెండేళ్ల నుంచి తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్ గా దూసుకుపోతున్నాడు. సరైనోడు రిలీజ్ కి ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తమన్ ఇలా తన ఒపీనియన్ చెప్పాడు. అభిప్రాయాలు ఉండొచ్చు కానీ, అవి తన క్లయింట్లను దెబ్బతీసేలా ఉండకూడదుగా. ఇచ్చే రెమ్యునరేషన్ బట్టే్ సాంగ్స్ లో క్వాలిటీ ఉంటుందనడం నిజంగా ఆశ్చర్యమే ఎందుకంటే ఇతగాడే కెరీర్ బిగినింగ్ లో మళ్లీ మళ్లీ అనే ఓ లో బడ్జెట్ సినిమాలో మంచి మ్యూజిక్ అందించాడు. 

అందులోని ట్యూన్లు ఆ తర్వాత కొన్నిటికి వాడాడు కూడా, మరి ఇప్పుడు డబ్బు ఎంత ఎక్కువ ఇస్తే అంత క్వాలిటీ ఇవ్వగలను అనడం నిజంగా ప్రౌడ్ నెస్ కి కారణమనే చెప్పాలి. టెక్నాలజీ కొనడం వరకూ డబ్బు ఖర్చు పెట్టాలేమో కానీ, టెక్నాలజీతోనే పాటలు తయారు కావు. సరిగమలను అల్లుకోవడమే కాని, అమ్ముకోవడం ద్వారా క్వాలిటీ తెస్తాననడం విషాదమే మరి.
Taman is the one of the top most music director in Tollywood. From last few years he is getting hits. But his comments about music in Sarinodu audio function are giving shock to all over industry.