తెగించి తిరుగుతున్నారు

1 Apr 2016


భారతదేశం మొదట్నుంచీ సహనశీల దేశమంటారు. అందుకు తగ్గట్లే మన మైండ్ సెట్ కూడా ఎదుటోడు ఒకటి తంతే, మళ్లీ ఎక్కడ తిరిగి ఎగిరెగిరి తంతాడో అన్నట్లు సైలెంట్ గా ఉండటమో, అక్కడ్నుంచి పారిపోవడమో చేస్తుంటాం. ఇలాంటి సహనంతోనే పాకిస్తాన్ పై యుధ్దంలో గెలిచి కూడా వాళ్లు భూభాగాన్ని వాళ్లకి అప్పగించేశాం, పైగా మనది లాకున్నా ఇప్పటికీ కిందా మీదా పడుతున్నాం తప్పితే మనంతట మనం యుధ్దానికి దిగింది లేదు. జమ్ము కశ్మీర్ సంగతే చూసుకుంటే ఇప్పటికి 60 ఏళ్లుగా అక్కడ రావణకాష్టంలా ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉన్నాయ్. మన దేశంలో భూభాగం అయినా కూడా పాక్ ప్రేరేపిత వాదమే అక్కడ గూండాయిజం చెలాయిస్తుంటుంది. 

ఇవాళ వాళ్లు మరింత బరి తెగించి, పాకిస్తాన్ జెండాలు ఎగరేశారు. ఇది చూస్తూ ఉండటమే తప్ప పిట్టల్ని కాల్చినట్లు కాల్చడం మాత్రం మనోళ్లు చేయరు. భారత్ మాతాకీ జై..అనకపోయినా...జై హింద్ అనకపోయినా..ఫర్లేదు..దేశభక్తి గుండెల్లో ఉండేది. బైటికి చెప్పినంత మాత్రాన నినాదాలు చేసినంత మాత్రాన పెతోల్లూ దేశభక్తులు కాకపోవచ్చు. కానీ ఇలా దేశంలో బతుకుతూ దేశం తిండి తింటూ పక్కదేశానికి జిందాబాద్ లు కొట్టేవాళ్లని మాత్రం శిక్షించకపోతే, అది మన చేతకానితనమే అవుతుంది.
Kashmir and Pak accupaid Kashmir are the native places of terrorists. Yesterday some terrorists hosted Pakistan flag in Kashmir.