కెప్టెన్ కామెడీ

14 Apr 2016


డీఎండీకే అధినేత విజయకాంత్ తొలిసారిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. వ్యంగ్య, విమర్శనాసా్త్రలతో విరుచుకుపడ్డారు. తమిళనాడు ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కెప్టెన్ విజయ్ కాంత్ తన ఆరోపణలకు పదును పెంచారు. జయలలిత, కరుణానిధి ఇద్దరూ ఇద్దరే అని వారిని నమ్మొద్దంటూ ప్రచారం చేశారు. మరోసారి ఈ దోపిడి దొంగలకు అవకాశం ఇవ్వొద్దంటూ సూచించారు అంతటితో ఊరుకోని విజయ్ కాంత్, కరుణానిధి చీర కట్టిన జయ అని, అన్నాడీఎంకే జయలలిత పంచె కట్టిన కట్టిన కరుణానిధి అని సెటైరేశారు.

యాభైఏళ్లు రాష్ట్రాన్ని వీరిద్దరూ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఇక దాంతో పాటు విజయ్ కాంత్ డయాస్ పై జయలలిత ఎలా నడుస్తారో కూడా చూపించి నవ్వులు కురిపించారు. మొత్తానికి కెప్టెన్ విజయ్ కాంత్ తన డిఎండికే పార్టీ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాలో ఉన్నారు. దాని సంగతెలా ఉన్నా, ఆయన ప్రచారం మాత్రం జనాలకు వినోదం పంచుతోంది.
Tamilnadu state is very hot with political announcements and summer heat. All party leaders are busy in campaign. DMDK leaders campaign is very hot, he is talking about Jayalalitha and Karunaanidhi.