ఊకదంపుడు నంబర్ 1

28 Apr 2016


సొంతడబ్బా, పరనింద, చెప్పిందే చెప్పడం, గాలికి వదిలిన పిండిని కృష్ణార్పణం నా గొప్పే అనడం ఆ సిఎంకి చెల్లు. ఏదో అన్ని పార్టీల పోరు, సమైక్యవాదుల అతి తెలివితో వ్యవహరించడంతోనే తెలంగాణ ఏర్పాటైంది. అంత మాత్రాన ఆయన ఏదో గొప్ప ప్రపంచత్యాగిలా (ఈ పదమే కరెక్ట్) తాను చేసింది, ఇంకెవరూ ప్రపంచంలో సాధించనట్లు బిల్డప్ ఇస్తూ ప్రసంగాలు చేయడంలో కోటలు దాటి పోయారు. ఇప్పుడు ప్లీనరీ అంటూ పెట్టుకున్నారు, పెట్టుకున్నారు. పో మళ్లీ అక్కడా ఆంధ్రావాళ్లనే ఆడిపోసుకోవడం, కొంతమంది అనేదాని ప్రకారం ఈయన జీవితపర్యంతం అలా ఆడిపోసుకుంటూనే ఉఁడాలి. లేదంటే ఓట్లు పడవట, అటు కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలతోపాటు విద్యార్ధిసంఘాలు చేసిన ఈ పోరులో క్రెడిట్ అంతా ఈయనే తీసుకుని, కుటుంబానికి పదవులు కట్టబెట్టుకున్న ఘనత కూడా ఆయనకే దక్కింది.

ఈరోజున నగరంలో చుక్క నీరు లేదు, దానికోసం ఎన్ని చోట్లు, ఫైట్లు. అలాంటిది ప్రతి నల్లాకి నీళ్లిస్తానని, లేదంటే రాళ్లతో కొట్టండంటూ పిలుపు ఇచ్చిన కేసీఆర్. ప్లీనరీలో దానిపై మళ్లీ వాగ్ధానాలు చేయడం అవసరమా. పైగా ఉద్యోగాల సంగతి, ఇంతవరకూ ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినయ్, ఇకపై ఎన్ని వస్తాయ్. ఇలాంటి సొల్లు మాటలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయ్. వాటన్నింటినీ నమ్మి ఓట్లేసినందుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. సమగ్ర స ర్వే ఫలితాలేందో వాళ్లకే తెలియాలి. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు దండగ చేసాయో చూస్తూనే ఉన్నాం. కరీంనగర్ లో థేమ్స్ నదిలా ట్యాంక్ బండ్ అంటారు. వరంగల్ రోమ్ సిటీ అంటారు. హైదరాబాద్ రియో డిజెనిరో సిటీ అంటారు. అసలు ఇలాంటి మాటలు మాట్లాడే ముందు రోడ్లపై కొళాయిల దగ్గర క్యూలు లేకుండా చూస్తే చాలు.
Today in Telangana is TRS government is conducting plinary. KCR gave so many promises at the time of elections. Till no progress in Telangana State.