ఎగిరెగిరి పడుతోన్న టీ కాంగ్

18 Apr 2016


అన్నీ ఉంటే ఆ తీరువేరు. ఇప్పుడు టీ.కాంగ్రెస్ మాత్రం  ఏమీ లేకుండా ఎగిరెగిరి పడుతోంది, అందుకే పిసిసిని జంబో నెట్ వర్క్ త రహాలో విస్తరించేసింది. ఇందులో చోటు దక్కనోడుంటే ఒట్టు, పార్టీలో ఉన్న రాష్ట్ర నాయకులందరికీ పదవులు కట్టబెట్టడం విశేషం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ పీసీసీ కార్యవర్గం ఏర్పాటైంది. 130 మందితో జంబో కమిటీని ప్రకటించింది హై కమాండ్. చిన్న లిస్టు కావాలన్న PCC సూచనను పక్కనబెట్టిన హస్తిన పెద్దలు, ప్రజా ప్రతినిధులు, మాజీలతో కమిటీని నింపేశారు. కొత్త రాష్ట్రం వచ్చాక పీసీసీ సారధులు మారినా కార్యవర్గాన్ని మాత్రం ప్రకటించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో బొత్స, కొత్త రాష్ట్రంలో పొన్నాల హయాంలోకూడా కార్యవర్గ ఏర్పాటుకు పార్టీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత ఎట్టకేలకు కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది ఏఐసీసీ.

అధిష్టానం ప్రకటించిన జంబో టీంలో జంబో చాలా మార్పులు జరిగాయి. గతానికి భిన్నంగా లిస్టును కుదించి చిన్న టీంను ఎంపిక చేయాలని ముందు హై కమాండ్ భావించింది. ఐతే అలా చేస్తే ఇప్పటికే ఎగిరెగిరి పడుతున్న విస్తరి, కుక్కలు చింపిన విస్తరిలా మారే ప్రమాదం ఊహించి 130 మందితో కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇందులో పీసీసీ ఉపాధ్యక్షులుగా 13 మంది, ప్రధాన కార్యదర్శులుగా 31 మంది, కార్యవర్గ సభ్యులుగా 35 మంది, శాశ్వత ఆహ్వానితులుగా 22 మందిని హైకమాండ్‌ నియమించింది. గతంలో 8మందితో కొనసాగిన పీసీసీ కో ఆర్డినేషన్‌ కమిటీని ఈసారి ఏకంగా 31 మందికి పెంచేసింది. అయితే ఈ టీంలో కేవలం ఎనిమిది మంది మహిళలకు మాత్రమే చోటు దక్కింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు, మాజీలకు కమిటీలో స్థానం ఇచ్చింది. ప్రధాన కార్యదర్శుల్లో సగంమంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. మిగిలి ఉన్న అధికార ప్రతినిధులు, కార్యదర్శులను మరో రెండు రోజుల్లో ప్రకటించి ఎంపికను పూర్తిచేయాలని అధిష్ఠానం భావిస్తోంది. అందరినీ సంతృప్తి పరిచేలా, ఎక్కడా విమర్శలు రాకుండా జాగ్రత్తగా టీంను ఎంపిక చేసానని కాంగ్రెస్‌ హై కమాండ్ చెప్పుకోవచ్చు కానీ, అసలు ఇంత మంది నేతలుంటే ఎందుకు గెలుపు మంత్రం తెలుసుకోలేకపోతోందో అర్ధం చేసుకోవాలి.
Recently T.Congress declared roiling comity Telangana. After 10 years it forms comity with 130 members.