సెక్సిణితో బాలయ్య

4 Apr 2016


బాలకృష్ణ చూడని ఎత్తులు లేవు, దిగని లోతులు లేవని ఆయనే చెప్పుకున్నాడు సావిత్రి ఆడియో ఫంక్షన్లో. ఇది ఏ అర్ధంతో అన్నదీ అందరికీ అర్ధం అవుతూనే ఉంది. పైగా బాలకృష్ణ కెరీర్ మొదట్లో డబుల్ మీనింగ్ డైలాగులకు కొదవే ఉండేది కాదు. మంగమ్మగారి మనవడు, భానుమతిగారి మొగుడు, ముద్దుల కృష్ణయ్య, దొంగరాముడు ఇలా కొన్ని సినిమాల్లో మనోడు హీరోయిన్లతో, హీరోయిన్లు మనోడితో మాట్లాడే మాటలకు మాస్ జనం తెగ తొడలు చరుచుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లు. పైగా బాలయ్యకి కూడా తన  ఇమేజ్ ఏంటో, తాను ఎలాంటి డైలాగులు వాడితే వారికి ఆనందం కలుగుతుందో తెలుసు. ఇది ఆయన్ని తక్కువ చేయడం కాదు అతని క్లారిటీకి ఉదాహరణగా చెప్తున్నాం.

ఇప్పుడు బాలకృష్ణ అలానే తన వందో సినిమాకి కథ, క్యాస్టూమింగ్ తయారు చేసుకుంటున్నాడు. అందులో ఓ క్యారెక్టర్ కి సన్నీ లియోన్ ని తీసుకుంటున్నారనే న్యూస్ ఓ పచ్చపత్రికలో వచ్చింది. పైగా అలా ఆమెగారు నటించడంతో సినిమా రేంజ్ పెరిగిందని కూడా రాసుకొచ్చిందా పత్రిక. ఓ బూతు సుందరి తన సినిమాలో నటిస్తే రేంజ్ పెరగడమేంటో అది రాసినోడికి తెలియాలి. అసలు డైరక్టర్ అంటేనే క్రియేటర్, మళ్లీ క్రియేటివ్ డైరక్టర్ దర్శకత్వంలో అంటూ పైత్యం ప్రదర్శించారు. గతంలో కృష్ణవంశీ పేరుకు ముందు అలా రాసుకునేవాళ్లు, ఇప్పుడీయనకి మొదలుపెట్టారు కాబోలు మరి!

బాడీపై చిన్న పీలిక కూడా లేకుండా నటించే వారికి మన తెలుగు సినిమాల్లో అర కొర బట్టలు చాలా సంప్రదాయబద్దంగా ఉన్నట్లు కన్పించడంలో వింతేముంది. అలానే బొడ్డుకిందకు భగస్థానం కన్పించేలా చీరకట్టినా వాళ్లకి ట్రెడిషనల్ గా ఉంటది మనకి మాత్రం చొంగకార్చుతుంటారు. అలాంటి నటిని పట్టకొట్టి కావాల్సినంత అంగాంగ ప్రదర్శన చేయించుకోవడమే తప్ప, తెలుగులో ఆ మాత్రం పాత్రలో నటించే నటులే దొరకరా. ఇలాంటి న్యూస్ ని సినిమా రేంజ్ పెంచే న్యూస్ లా ఆ దమ్మున్న పత్రిక రాయడంలోని కిటుకు ఏంటంటే, సదరు సెక్సిణి ఫోటో వేసి కాస్త జనాన్ని ఆకట్టుకోవాలనే పైనా కిందా ఓ నాలుగు లైన్లు రాసి కథనం రాస్తే సరి  అని వాళ్ల ఫీలింగ్.
Now Balakrishna is busy with his 100 movie shooting. He is doing his hundered movie with Director Krish. In this movie Sunny Leone is also doing a role.