హాట్ ప్రొడ్యూసర్

11 Apr 2016


సన్నీలియోన్ ని ఇప్పుడు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. హాట్ గా చెర్రీ ఫ్రూట్ లా కన్పించే సన్నీని చూసి లొట్టలేయని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో ఫారిన్ లో తన బూతు పనులేవో తాను చేసుకునే సన్నీని బిగ్ బాస్ సీజన్ లోకి తీసుకురావడంతోనే ఆమె స్టార్ తిరిగిపోయింది. అడల్ట్ స్టార్ గా తన ఇమేజ్ పోయి, బాలీవుడ్ స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఐతే ఎన్ని బూతుపనులు చేసినా తన మొగుడు, బాయ్ ఫ్రెండ్ తోనే చేశానని సన్నీ చెప్తుంటుంది. బాలీవుడ్ తో పాటు, తెలుగులో కూడా రెండు సినిమాల్లో మెరిసిన సన్నీ అందాలు మగ్గిన బంగినపల్లి రసాల్లా అందరినీ ఆకట్టుకున్నాయ్. 

ఐతే తొందర్లోనే ఈ అందాలు బోర్ కొట్టే ప్రమాదముందని ముందే గ్రహించింది. మస్తీ జాదే, క్యా కూల్ హై హమ్, వన్ నైట్ స్టాండ్ లాంటి మూవీస్ చేస్తున్న సన్నీ లియోన్ దీపం ఉండగానే ఇల్లేం ఖర్మ డ్యూప్లెక్స్ సర్దుకుంటోంది. తొందర్లోనే ఓ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా మారుతోందట. తన క్రేజ్ ఏంటో ఖచ్చితంగా అంచనా వేసింది కాబట్టే ప్రొడ్యూసర్ గా లాభాలు వెనకేసుకోవాలనుకుంటోందట సన్నీ. ఐతే గతంలో ఇలానే కొంతమంది తారామణులు సొంతంగా సినిమాలు తీయబోయి బొక్క బోర్లా పడ్డారు. కానీ సన్నీ ఇమేజ్ వేరు కాబట్టి మినిమమ్ గ్యారంటీ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
Sunny Leone started her carrier as p0rn star and after entering into Bollywood her life taken turn. Now she is doing movies with big stars also. Now she entering into production.