ఆ సిఎం నన్ను వాడుకున్నాడు

6 Apr 2016


కేరళలో ఇప్పుడు సరితా నాయర్ పేరు తెలీనివాళ్లు లేరు. సరితా ఎస్ నాయర్ ఓ నటి, తర్వాత బిజినెస్ ఉమన్, తర్వాత జైలుపక్షి ఇప్పుడు పొలిటీషియన్ అయినా అవ్వొచ్చు. సరితా నాయర్ నిజానికి కేరళలో చిన్న నటిగా కెరీర్ మొదలుపెట్టింది. బి గ్రేడ్ సినిమాల్లో తన భారీ అందాలను ప్రదర్శిస్తూ ఓ రేంజ్ కి చేరింది. ఆ తర్వాత పొలిటికల్ సిస్టమ్ లో ఉన్న లూప్ లైన్లు పట్టుకుని సిఎం పేషీలో ఏ పనైనా చేయించుకునే స్థాయికి చేరిందంటారు. ఇప్పుడా సరితనే సిఎం ఊమెన్ చాందీ నన్ను అన్నిరకాలుగా వాడుకున్నాడంటూ ఆరోపిస్తోంది. ఇది గత రెండేళ్లుగా చేస్తున్న ఆరోపణలే అయినా, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈమె మరింత సౌండ్ పెంచడంతో అక్కడి కాంగ్రెస్ పార్టీకి గుబులు పట్టుకుంది. పైగా ఊమెన్ చాందీ కుమారుడు కూడా తనని లైంగికంగా వేధించాడని సరితా నాయర్ చెప్తుండటం ఓ క్రైమ్ థ్రిల్లర్ ని తలపిస్తోంది.

సోలార్ పవర్ కంపెనీలు, ప్యానెళ్లు తయారు చేసే కంపెనీలకు కన్సెల్టెన్సీలా సరితా నాయర్ ఆమె భర్త పని చేశారు. త్వరగా కంపెనీలకు అనుమతులు తెస్తానంటూ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్న కేసులో ఈ ఇద్దరూ జైల్లో పడ్డారు. ఆ సందర్భంగా వాళ్లిద్దరూ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, తమ కంపెనీలు ప్రారంభించేందుకు సరితానాయర్ స్వయంగా కేరళ సిఎం ఊమెన్ చాందీకి విడతలవారీగా డబ్బులు ఇచ్చానని చెప్తోంది. దానికి రుజువులు కూడా  ఉన్నాయంటూ ఊమెన్ చాందీ చెవిలో సరితా నాయర్ గుసగుసలాడుతున్న ఫోటో ఒకటి అప్పట్లో చక్కర్లు కొట్టింది. సిఎం కూడా ఈ కేసు విచారణ చేస్తున్న జడ్జి ముందు మూడు గంటల పాటు విచారణ ఎదుర్కొని హైకోర్టు స్టేతో బయటపడ్డారు. అందుకే సరితానాయర్ ఆరోపణలు మరోసారి సెన్సేషన్ కలిగిస్తున్నాయ్.
Kerala heroin Saritha filed a case against Kerala CM Ooman Chand. Once upon a time she is a B-Grade heroin. Now she is doing business.