వ్యాంప్ గా సంజన

18 Apr 2016


బుజ్జిగాడుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంజన అప్పుడు ఎవరికీ పెద్దగా టచ్ అవ్వలేదు, కానీ మర్డర్ రీమేక్ కన్నడ సినిమాలో మల్లికాశెరావత్ క్యారెక్టర్లో జీవించేయడంతో ఆమెలోని సెక్సప్పీల్ బైటపడింది..అసలు అది చూసే పూరీ జగన్నాధ్ తన మూవీలో తీసుకుని ఉంటాడు కూడా..!

మెుగుడు పెళ్లాం ఓ బాయ్ ఫ్రెండ్ పేరుతో ఆ  సినిమా తెలుగులో కూడా రిలీజైంది. అది చూసి ఔరా సంజన ఇంత బరితెగింపా అంటూనే సొల్లు కార్చేశారు. అంత పచ్చిగా రెచ్చిపోయిన సంజన  ఇప్పుడు తిరిగి వ్యాంప్ క్యారెక్టర్ల వైపే మళ్లుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా ఒకటి ఆంధ్రా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. పవన్ కల్యాణ్ సరసన నాకో ఛాన్స్ వచ్చిందంటూ అప్పట్లో ఈ సెక్సీబ్యూటీ తెగ ఫోజులిచ్చింది.

తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే సంజన బొమ్మకి అంత సీన్ లేదని తేలిపోయింది. కనీసం చెప్పుకోవడానికి ఇదీ నా సీన్ అని కూడా దృశ్యాలు లేవు. అన్నీ కప్పుకున్న విలన్ భార్యగా ఆమె క్యారెక్టర్ కి ఎలాంటి మార్కులు పడ్డాయో తెలిసాక ఇక సంజన ఐటెమ్ సాంగ్స్ కే పరిమితం కావాలేమో మరి.
Bujjigadu fame heroin Sanjana is now doing as a vamp characters. She has no movies in Tollywood, but she did a Malayalam movie.