లైఫ్ స్టోరీ

17 Apr 2016


క్రికెట్ దేవుడు, ఎంతో మందికి ఇన్ఫిరేషన్, మరెంతోమందికి మోటీవేటర్.. ఇలా సచిన్ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. క్రికెట్ లో ఆయన దేశానికి తెచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఇప్పుడు అతడి బయోపిక్ ఆధారంగా సచిన్ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సచిన్ కూడా నటిస్తున్నాడు. జేమ్స్‌ ఎరికన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను  రిలీజ్ చేశారు.

చిన్నతనంలో సచిన్ తన తండ్రి వేలు పట్టుకుని వెళ్లడం, తొలిసారి బ్యాట్ పట్టుకున్న ఆనందం, అన్నతో కలిసి ఆడటం, స్కూల్లో తోటి పిల్లలతో ఫైటింగ్స్‌, హెల్మెట్ పెట్టుకుని గ్రౌండులోకి వెళ్లడం, మిడిల్ వికెట్ మీద నాణెం పెట్టి ఆడటం, ఒళ్లంతా మూడు జెండా రంగులను పులుముకుని జెండా ఊపుతూ కనిపించే సచిన్ వీరాభిమాని ఇవన్నీ కూడా టీజర్‌లో జోడించారు.
A movie is picturing Cricket god Sachin story. Bollywood director James Ericsan is directing this movie.