చంద్రబాబుకి మైండ్ బ్లాక్ అయిందా?

18 Apr 2016


అసెంబ్లీలో వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక చంద్రబాబుకి మైండ్ బ్లాక్ అయిందంటూ రోజా సెటైర్ వేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏడాదిపాటు సస్పెన్షన్ ఎదుర్కొంటున్న రోజా, తన దూకుడు తగ్గించే ప్రసక్తే లేదని తాజా కామెంట్లతో ప్రూవ్ చేసుకున్నట్లైంది. పచ్చపార్టీలో మగాళ్లు లేరని, అందుకే వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైల్వే జోన్ కోసం దీక్ష చేస్తున్న గుడివాడ అమర్నాధ్ కి మద్దతుగా శిబిరానికి వచ్చిన రోజా, టిడిపి మంత్రులను టార్గెట్ చేయడంతో పాటు చెరిగిపారేశారనడంలో సందేహం లేదు. మరోవైపు దీక్షాశిబిరానికి అనూహ్యమైన మద్దతు వస్తుండటంతో టిడిపి బిజెపికి దిక్కుతోచని పరిస్థితి. మరి ఎంచుకున్నది ప్రజల సబ్జెక్ట్ అయినప్పుడు సపోర్ట్ కూడా అలానే ఉంటుంది. 

నేతల ప్రసంగాల్లో రోజా స్పీచ్ కి సెటైర్లకే ఎక్కువ స్పందన రావడం గమనార్హం. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులు పోటీపడి దోచుకుంటున్నారని ఆరోపించారు రోజా. ప్రజాసమస్యలను గాలికొదిలి విందు, వినోద కార్యక్రమాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారన్నారని మండిపడ్డారు. చేతగాని మంత్రుల వల్లే రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
YSRCP MLA Roja hot comments in Gudiwada, became hot topic in media and TDP. Recently she was suspended for one year but still she not compromising with her comments.