నాపై సస్పెన్షన్ అందుకే

1 Apr 2016


వివాదాస్పదమైన రీతిలో సస్పెండైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పోరాటం ఆపనని చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్లి సస్పెన్షన్ పిటీషన్ పై విచారణ చేయించుకోగా, హైకోర్టు సింగిల్ జడ్జ్ దానిపై స్టే ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం డివిజన్ బెంచ్ స్టే ఎత్తేయించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు రోజా డివిజన్ బెంచ్ పై సుప్రీంకోర్టుకు వెళ్లారు. సమస్యలపై తన గొంతు ఘాటుగా ప్రశ్నిస్తున్నందుకే తనపై అనర్హత వేటేస్తున్నారంటూ రోజా మరోసారి వాపోయారు. వచ్చే సోమవారం పిటీషన్ విచారణకు వస్తుందన్న రోజా కాల్ మనీ, వడ్డీ వ్యాపారుల ఆగడాల వెనుక టిడిపి నేతలున్నారని ఆరోపిస్తూ వచ్చారు. ఆ సమస్యను పక్కదారి పట్టించేందుకే తనపై సస్పెన్షన్ వేటేసినట్లు చెప్తున్నారామె.

అసలు చంద్రబాబు, ఆయన చిన్నబాబు లోకేష్ ఇద్దరూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ మరో స్టాక్ డైలాగ్ వేశారామె. అలా వచ్చిన డబ్బులతోనే ఎమ్మెల్యేలను కొంటున్నారని మరోసారి ఆరోపించారు. ఐతే రోజాకి తెలియని విషయం ఏంటంటే అలా అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు పోవడమే మేలని జగన్ ఫీలింగ్. అది పక్కనబెడితే  ఎంతసేపూ చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసేబదులు, సుప్రీంకోర్టు విచారణ తర్వాత తన పోరాటం మరింత ఘాటుగా చేస్తే చాలు, అంతేకానీ జనం ఎవరు ఏంటనేది బాగా తెలుసుకున్నారు, టైమ్ వచ్చినప్పుడు స్పందిస్తారు. ఈలోపు అనవసరంగా ప్రయాసే తప్ప వేరేది ఉండదు.
YSRCP MLA Roja is very serious about suspension on her. She dont want to gave up her case, now she approached supreme court.