సూర్య వర్సెస్ ఏపీ

17 Apr 2016


సూరీడు ఏపీ పై పగ బట్టినట్లు రెచ్చిపోతున్నాడు. ఎండ దెబ్బకి జనం బైటికి రావాలంటే జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లోనే జనం బైట తిరుగుతున్నారు లేదంటే పని మానుకుని ఇళ్లలోనే ఉంటున్నారు. అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ్. తీవ్ర ఉక్కబోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హాట్ సమ్మర్ ని బీట్ చేసెదలా అంటూ వాపోతున్నారు. ఇంట్లో ఉండలేరు, బైటికిపోలేరు అప్పుడే 70 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఎండ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. డైరక్ట్ గా ఆమ్లెట్, దోశెలు, పూరీలు వేసుకుని ఎండ వేడిని అడ్వాంటేజ్ తీసుకుంటున్నోళ్లున్నారు.

కేప్, కండువా, కర్ఛీప్ ఏదుంటే అది నెత్తిపై కప్పుకుని బైటికి రావాల్సిన సిచ్యుయేషన్. ఏసీలు, కూలర్లు వాడుతూ బయట ఎండను తట్టుకుంటున్నా. అవి లేని జనం మాత్రం కుండనీళ్లు, తాటాకు పందిళ్లతో తృప్తి పడుతున్నారు. మధ్యలో నలుగుతోంది మధ్యతరగతి జీవులే..!
In both telugu states temperatures are going very high from day to day. In Andhra Pradesh its going record stage. Middle of April it reaches above 40 degrees.