జగన్ మౌనం వెనుక?

17 Apr 2016


వైసీపీ నుంచి జోరుగా వ‌ల‌స‌లు ఎందుకు కొన‌సాగుతున్నాయి..? పార్టీ నుంచి వెళ్లే ఎమ్మెల్యేలు నిజంగా అధికార టీడీపీ చేస్తున్న అభివృద్ధి చూసే వెళుతున్నారా..? లేదంటే  వైసిపి నుంచి టిడిపిలో చేరుతున్న ఎమ్మెల్యేల వెన‌క రహాస్య ఎజెండా ఉందా..? జ‌గ‌న్  ద‌గ్గ‌రి బంధువులు సైతం పసుపు కండువాలు క‌ప్పుకుంటున్నా, జ‌గ‌న్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు..? పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా వైసీపీని గానీ, పార్టీ అధినేత జ‌గ‌న్‌పై గానీ విమ‌ర్శ‌లు చేయ‌క‌పోవ‌డం వెనుక‌ కార‌ణం ఏంటి.? ఏదో ఉందనే పరిణామాలను నిశితంగా పరిశీలించినోళ్లంటున్నారు. ఇక జగన్ కూడా  పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను రాజీనామా చేయించాల‌ని ఒత్తిడి తెస్తున్నా, బాబుని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌భుత్వంపై అవిశ్వాసం నొటిసిచ్చిన వారిలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య కృష్ణ రంగారావ్ ఉరభ్ బొబ్బిలి దొరదే మెయిన్ రోల్  అయితే ఆయన కూడా టీడీపీ గూటికి చేర‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

తాజాగా అధికార పార్టీలో చేరేబోయే  నేత‌ల జాబితాలో, జ‌గ‌న్ ద‌గ్గ‌రి బంధువు బాలినేని శ్రీనివాస‌రెడ్డి కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయినా కూడా జ‌గ‌న్ ఆపే ప్ర‌య‌త్నం గ‌ట్టిగా చేయ‌టం లేదు. దీని వెనుక పెద్ద ప్లాన్ లేకపోయినా నిగూఢ రహాస్యం ఉందట. అదేంటంటే  టీడీపీ మ‌రో మూడేళ్ల‌పాటు అధికారంలో వుంటుంది కాబ‌ట్టి అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉండేకంటే, పవర్ లో చేరితే పవర్ ఫుల్ గా మారి తిరిగి జగన్ గూటికి చేరుకోవచ్చనేదే ఆ ప్లానట. మరోవైపు వలసలతో టిడిపిలో కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అందుకే వలసలతో బలపడుతున్నామని టిడిపి అనుకుంటే అది అవివేకమని పొలిటికల్ పండితుల టాక్.
Maximum number of YSRCP MLAs are joining into TDP. Nearest relatives of YS Jagan are also joining into TDP. But still Jagan is silent.