మరో జంప్ జిలానీ?

4 Apr 2016


పార్టీలు మార్చడంలో ఆయనకి పేటెంట్ రైట్స్ ఇవ్వొచ్చు, ఎన్నికల సమయంలో పార్టీలు మారడంలో రాయపాటి దిట్ట అంటారు. అందుకు తగ్గట్లుగానే ఆయన కాంగ్రెస్ నుంచి టిడిపికి జంప్ కొట్టాడు, ఎంపి పదవి పట్టాడు. ఐతే పార్టీ మారక ముందు మాత్రం ఎంత హడావుడి చేశాడో చాలా కొద్ది మందికే తెలుసు, పోలవరం ప్రాజెక్టు దక్కిందాకా, కాంగ్రెస్ లో కొనసాగి కిరణ్ కుమార్ తో పార్టీ కూడా పెట్టిస్తామంటూ తెగ బిల్డప్ ఇచ్చాడు. తీరా ప్రాజెక్టు దక్కగానే, కిరణ్ కి హ్యాండిచ్చేసి బాబుతో దోస్తీ కట్టేశాడు. ఇప్పుడా చాతుర్యమే మళ్లీ రిపీట్ చేస్తాడట రాయపాటి, తన శిష్యుడు డొక్కాని కూడా టిడిపిలోకి లాగేసిన రాయపాటి మరో ఫాలోయర్ ముస్తాఫాని కూడా లాక్కొస్తాడట. టిడిపికి జిల్లాలో మైనార్టీ ఎమ్మెల్యేలు లేరు. అందుకే వైసీపీ నుంచి కాస్త తేడాగా ఉన్న వాళ్లని టచ్ చేస్తే, మంచి ఆఫరిస్తామని చంద్రబాబు చెప్పాడట.

ఇది ప్యాకేజీల కాలం కావడంతో గుంటూరు ఈస్ట్  ఎమ్మెల్యేని ఈజీగా టిడిపిలోకి లాక్కోవచ్చని ఆ పార్టీ శ్రేణులు కూడా అంచనా వేస్తున్నాయ్. మైనార్టీ కేటగరీ లో విజయవాడ వెస్ట్ నుంచి జలీల్ ఖాన్ వస్తే కేబినెట్ మంత్రి పదవి దక్కుతుందని ఆశపెట్టారు. ఇప్పుడు ముస్తాఫాని కూడా తెచ్చేసుకుంటే ఇద్దరిలో ఎవరికో ఒకరికే ఇస్తామంటూ అసలుకే ఎసరు పెట్టొచ్చనే మాస్టర్ ప్లాన్ బాబు రచించినట్లు టాక్. ఐతే ఇప్పుడు ముస్తాఫా వైఎస్సార్సీపీ నుంచి జంపైతే, నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మాకే ఇవ్వాలంటూ ఇప్పటికే కొంతమంది వైసీపీలో ప్లాన్లు గీసుకుంటున్నారట.
Rayapati Hanumant Rao jumped from congress to TDP and got MP position. Now he is trying to jump to TRS.