ముప్పావు గంట ఆగిన గుండె

22 Apr 2016


ఆగిపోయిన గుండె తిరిగి కొట్టుకోవడం జరుగుతుందా, బహశా ఓ రెండు నిమిషాలు అలా జరిగితే జరగొచ్చేమో కానీ అతనికి మాత్రం ముఫ్పావు గంట ఆగిపోయినా, తిరిగి పని చేయడం ప్రారంభించింది. ఐతే దీనికి డాక్టర్లు కూడా తమ సాయం చేయడంతోనే సాధ్యపడింది. చెన్నయ్‌లోని ఫోర్టిస్ మలర్ వైద్యులు 45 నిమిషాలు ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందింప చేశారు. గుజరాత్‌కు చెందిన జైసుక్‌బాయ్ తాక్కర్  కి గుండె జబ్బు ఉండడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయనను విమానంలో పోర్‌బందర్ నుంచి చెన్నయ్‌కి తీసుకొచ్చి ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె మార్పిడి ఆపరేషన్ అవసరం కావడంతో దాత గుండె లభించే వరకు మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చేందుకు వైద్యులు తమ ప్రయత్నాలు చేశారు.

ఐతే మధ్యలో సడన్ గా ఆయన గుండె పని చేయడం ఆగిపోయింది. ఇలా 45 నిమిషాలు పాటు అలానే స్దబ్దుగా ఉండిపోయింది. ఐనా డాక్టర్లు తమ ప్రయత్నం మానుకోకుండా కృషి చేశారు. ఎట్టకేలకు జైసుక్ బాయ్ గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభించింది. ఇది ఎక్స్ స్ట్రా కార్పోరియల్ కార్డియో పల్మనరీ రెస్క్యుటేషన్ అనే పద్దతిలో గుండెని పని చేయించగలిగామని డాక్టర్లు చెప్పారు. అప్పటిదాకా కోమాలోనే జైసుక్ ఉన్నాడట, ఐతే ఇది నిజంగా అందరి విషయంలో విజయవంతం అవుతుందో లేదో చెప్పలేని స్థితి. అందుకే ఇప్పుడీ కేసు ఓ అద్భుతంగానే చెప్తున్నారు.
Now a days technology deloped very well. In Chennai hospital, rare heart surgery was done. After 45 minutes of heart stopped, it started working.