ఏంటో ఈమె తపన

11 Apr 2016


సినిమాల్లో గొప్పగా వెలిగిన వాళ్లు ఫేడౌట్ అయిన తర్వాత, ఆ జిగిబిగుల కోసం తహతహలాడుతుంటారు. ఫ్లాపో హిట్టో ముందు నటులుగా గుర్తింపు కోరుకుంటారు. అందుకోసం సొంతడబ్బులు పెట్టి సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నోళ్లు చాలామందే ఉన్నారు. కీర్తిశేషులు కాంతారావు, చలం తర్వాత నటీమణుల్లో సిల్క్ స్మిత (వీరవిహారం, స్త్రీ సాహసం), జయలలిత(వ్యాంప్ కేరక్టర్లు ఎక్కువ వేసింది), రోజా(సమరం) వారిలో కొంతమంది, ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఎక్కువగా క్యారెక్టర్ పాత్రలు చేసిన రమ్యశ్రీ చేస్తోంది. ఈమె ఓ మల్లి పేరుతో ఓ సినిమా తీసి రెండేళ్లు దాటింది, ఎప్పటికప్పుడు ఇది రిలీజ్ అవబోతోంది, అవబోతోంది అంటూ తెగ ప్రమోషన్ చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

పైగా ఈ సినిమాకి దర్శకత్వం కూడా వహించానని చెప్తోంది. ఈ ఏప్రిల్ 15 న సినిమా రిలీజవుతోందని మరోసారి చెప్తున్న రమ్యశ్రీ ఇందులో జాకెట్ లేకుండా నటించింది. కనీసం ఇది రిలీజైన తర్వాతైన కొన్ని ఆఫర్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తోంది. ఐతే రమ్యశ్రీ అటు ఈ ప్రయత్నంతో పాటు పొలిటికల్ గా కూడా లక్ టెస్ట్ చేసుకునేందుకు  తెలుగుదేశంలో కూడా చేరింది. ఓ లక్షరూపాయలు పార్టీ ఫండ్ కూడా ఇచ్చేసింది, ఐనా బాబు చూపు సరిగా పడకపోవడంతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్దగా కన్పించడం లేదీమె. కనీసం పార్టీ కేడరైనా తన సినిమా చూస్తే సక్సెస్ అవుతుందనే చిన్న ఆశ కూడా కన్పిస్తుంది రమ్యశ్రీలో.
Character artiest Ramya Sri is now doing as a producer. In her own production she did a film called O Malli. For this movie she is director also.