సరైనోడు ఎబౌవ్ సర్దార్

28 Apr 2016


ఇది మేం అంటున్నది కాదు రామ్ గోపాల్ వర్మ సిద్దాంతి గారు తన ట్వీట్ పురాణంలో ఇవాళ ప్రవచించిందే, ఎవరేమనుకున్నా నా ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేసుకుంటా పోతా అనే స్టైల్ ఆర్జీవీది. ఓ సారి పవన్ కల్యాణ్ పై ట్వీట్లేసి, ఇక ఆయన జోలికి పోనంటూ గుడ్ బై చెప్పి కూడా ఇప్పుడిలా ట్వీటేశాడంటే అర్ధం ఏంటి. రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమాకి పబ్లిసిటీ తక్కువ అయింది, అందుకే ఇప్పుడు మళ్లీ మెగా కాంపౌండ్ హీరోలను టార్గెట్ చేస్తున్నాడని ఫ్యాన్స్ గుసగుసలు మొదలెట్టారు.

ఎందుకంటే ఫ్రీగా పబ్లిసిటీ ఎలా తెచ్చుకోవాలో వర్మకి తెలుసు మరి. అసలు పవన్ కల్యాణ్ కి బన్నీకి పోలికే లేదని, కానీ అలా అనాల్సి వస్తుందంటూ మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కడం కూడా మనోడికి సాధ్యం. సర్దార్ ఫ్లాపైన తర్వాత సరైనోడు ని బేస్ చేసుకుని, దానికంటే ఇదే పెద్ద హిట్, అసలు పెద్ద హీరో బన్నీ. ఇంత పెద్దగా ఎప్పుడయ్యాడంటూ సెటైర్స్ విసురుతున్నాడు వర్మ. దీనిపై పవన్ స్పందించలేదు కానీ, ఖచ్చితంగా బన్నీ రియాక్షన్ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
Ramgopal Varma again hot topic in twitter. He again commented on Mega family. Recently commented on Bunny movie Sarainodu.