ఆగని ఎటాక్

11 Apr 2016


తనతో సినిమాలు చేయనివాళ్లని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ తెగ రెచ్చిపోతుంటాడు. అదే పనిగా అర్ధం పర్దం లేని భాషలో సెటైర్లు వేస్తూ బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ పండిస్తుంటాడు. బాహుబలి రిలీజయ్యాక తెలుగులో ఇక ఏ హీరో అయినా మరుగుజ్జు లేనంటూ ట్వీట్ చేసి కలకలం రేపగా, ఇప్పుడు పవన్ కల్యాణ్ పై రెచ్చిపోతున్నాడు. ఏదో సినిమా డబ్ అయి అది హిట్టైనంత మాత్రాన మన సినిమాలు కూడా అలా ఆడతాయనుకోవడం కలే అని. అలాంటి కలనుంచి పవన్ కల్యాణ్ ను నిద్రలేపాలంటూ ట్వీట్ పెట్టాడు. అది పీకే ఫ్యాన్స్ నైతిక బాధ్యత అంటూ గుర్తుచేశాడు. 


ఏదైనా గిల్లికజ్జాలు పెట్టుకోవడమంటే రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఆన్పించకమానదు ఈ ట్వీట్ చూస్తే. సినిమా రిలీజైంది, అది ఫ్లాపో హిట్టో ఆ ప్రొడ్యూసర్లు చూసుకుంటారు. కానీ అడిగినా, అడక్కపోయినా తన అభిప్రాయం చెప్తూ హీరోల ఫ్యాన్స్ తో ఆర్జీవీ సంవాదం పెట్టుకుంటున్నాడు. పోనీ మనోడి సినిమాలేమైనా ఇరగదీస్తాయా అంటూ లేదు. ఆర్జీవీ సినిమాలను ఎవడూ విమర్శించకూడదు, కానీ ఈయనగారు మాత్రం ప్రతి సినిమాపై అమూల్యమైన అభిప్రాయాలు చెప్తుంటాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐనా వర్మకి  ఇలా ఫ్రీ పబ్లిసిటీ వస్తున్నంత కాలం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మరి.
Once again Ramgopal Varma is hot news in media. Now his comments about Sardaar Gabbar Singh movie is creating angry in Pavan Kalyan fans.