రఫ్పాడించేసింది

13 Apr 2016


పిట్ట కొంచెం కూత ఘనం, ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన చెవులు వాడి లాంటి సామెతలన్నైనా రకుల్ ప్రీత్ సింగ్ కి సరిపోతాయ్. ఇప్పుడీ పాలబుగ్గల పిట్ట ఫేస్ బుక్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. అలా అక్కౌంట్ చేసి, ఆర్నెల్లు దాటిందో లేదో అప్పుడే ఫాలోయర్లను 50 లక్షలకు దాటించేసింది. ఒకప్పుడంటే స్టార్ హీరోయిన్లు కానీ, హీరోలు కానీ జనానికి దూరంగా ఉండేవారు. కలుపుగోలుగా కాకుండా డిస్టెన్స్ మెయిన్ టైన్ చేశేవాళ్లు కానీ, ఇప్పటి ట్రెండ్ మాత్రం ఫ్యాన్స్ కి వీలైనంత దగ్గరగా ఉండేందుకే ట్రై చేస్తున్నారు.

అందులో శృతిహాసన్, త్రిష ఈ రేసులో ముందంజలో ఉండగా, ఇప్పుడు రకుల్ ఫైవ్ మిలియన్స్ ఫ్యాన్స్ తో కేక పుట్టించేసింది. అరకోటి మంది రోజూ రకుల్ ప్రీత్ సింగ్ అప్ డేట్స్ ని పాలో అవుతుంటారు. ఆమె ఏం చేసినా ఫేస్ బుక్ లో చిన్న పోస్ట్ చెప్తే చాలు వెంటనే వారందరికీ చేరిపోతుంది. వారి దగ్గర్నుంచి ఛెయిన్ నెట్ వర్క్ లా ఇంకొంతమందికి, అలా తమ పాపులారిటీ పెంచుకుంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు. ఫాలోయర్ల సంఖ్యను చూపిస్తూ ఓ ఫోటో, వీడియో కూడా పోస్ట్ చేసింది రకుల్.
Tollywood heroin Rakul Preet Singh got more popularity with in very short time. She crossed top heroins also. Now her facebook account reached 50 lacks followers.