ఆయనలో నచ్చింది అదే

28 Apr 2016


రజనీకాంత్ స్టార్ డమ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయనతో ఎవరైనా కనీసం ఓ సీన్ లో ఐనా నటించాలని కోరుకుంటారు. అదీ ఆయన స్థాయి, షార్ట్ ఫిల్మ్స్ తో బాగా యూత్ కి దగ్గరైన రాధికా ఆప్టే కూడా ఇప్పుడా లిస్టులో చేరిపోయింది. కబాలిలో ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తున్న రాధిక, రజనీ గొప్పదనం గురించి తెగ పొగిడేస్తుంది. అంతకు ముందే రజనీకాంత్ కూడా రాధిక గురించి సెకండ్ సౌందర్య అంటూ పొగడటం గమనార్హం. ఈ ఎడాపెడా భాజాభజాయింపు వెనుక కొత్త సంగతి విన్పిస్తుంది. ఖచ్చితంగా రజనీ నెక్స్ట్ సినిమాలో కూడా రాధికా ఆప్టేకి చోటు ఉంటుందనేదే అది.

రజనీతో గడిపిన క్షణాలను మరిచిపోలేనని ములగచెట్టు ఎక్కిస్తున్న రాధీకా ఆప్టే మాంచి ముదరపండిన బంగినపల్లి మామిడిపండులా కన్పిస్తూ ఊరిస్తుంటుంది. తన వయస్సుకు తగ్గట్లు హీరోయిన్ గా మరీ లేతగా కాకుండా, ముదురుగా కాకుండా ఉండే ఇలాంటి భామలను ఎంకరేజ్ చేయడంలో రజనీ ముందుంటారు. అందుకే ఇప్పుడు రజనీకాంత్ ను రాధికా ఆప్టే పొగిడింపులు కార్యక్రమం మొదలెట్టిందట. అలానే ఈ అమ్మడు నటించిన ఫోబియా అనే సినిమా ట్రైలర్ కూడా రెండ్రోజుల క్రితమే రిలీజ్ అయింది. అది కూడా అందరినీ ఆకట్టుకుంటోంది, దీంతోపాటు కబాలి కూడా హిట్టైతే కనీసం ఓ  ఐదేళ్ల పాటు ఇండస్ట్రీలో వెలుగు వెలగొచ్చని రాధికా ఆప్టే లెక్కలేసుకుంటుంది.
Radhika Apte started her carrier with short films. Now she is doing continuous films. Now she is doing with Rajanikanth in Kabali movie.