ఒబామాతో ప్రియాంక విందు..

6 Apr 2016ఎక్కడ బిహార్..ఎక్కడ అమెరికా వైట్ హౌస్.. చిన్న నటిగా పేరు తెచ్చుకోవాలని కూడా అనుకోని ఓ అమ్మాయి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితోనే విందారగించబోతోంది. ముందు మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన ప్రియాంక చోప్రా సినీ రంగంలో తనకి ఎవరూ సాటిలేరనే స్థాయికి ఎదిగింది, మధ్యలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన టాలెంట్ తోనే వాటన్నింటిని అధిగమించింది. ఏషియన్ సెక్సీయెస్ట్ ఉమెన్, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ తో ఎక్కడికో వెళ్లిపోయిన ప్రియాంకచోప్రా క్వాంటికో అనే ఇఁగ్లీష్ సీరియల్ తో అమెరికా ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తోంది, తర్వాత బేవాచ్ మూవీలోనూ ఛాన్సు కొట్టేసింది.

మొన్నామధ్య ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం కూడా చేసేసింది, ఇక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి నివాసంలో ఆయనతో కలిసి డిన్నర్ తీసుకోబోతోంది ప్రియాంక చోప్రా. ప్రసిడెంట్ గా బరాక్ ఒబామా హుస్సేన్ వైట్‌హౌస్‌లో నిర్వహించే ఇచ్చే లాస్ట్ సప్పర్ ఇదే. ఈ గౌరవం అందుకున్న బాలీవుడ్ నటులు ఈ మధ్యకాలంలో ఎవరూ లేరు దీంతో ప్రియాంక ఏది పట్టుకున్నా బంగారమే అన్పిస్తోంది.
Bollywood heroin Priyanka Chopra is entered in Hollywood and she won People choice of the year ans $exyes women of Asian awards. Now she is going to take lunch with Obama.