రాజ్యాంగ నిర్మాతతో రాజకీయం

14 Apr 2016


అంబేద్కర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఆయన నామస్మరణ పార్టీలు అస్త్రంగా వాడుకుంటున్నాయ్. అటు యూనివర్సిటీల్లోనూ ఆర్ఎస్ ఎస్ వ్యతిరేక భావజాల వర్గానికి  అంబేద్కర్ వాదాన్ని మద్దతుగా తీసుకుంటున్నారు. .దానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా కన్పిస్తున్నాయ్, జాతికి స్వాతంత్ర్యం కానీ, .భావ స్వేఛ్చ, సమాజంలో సంస్కరణలకు బీజం వేసినవారిని ఏదోక కులం పేరిటో, వర్గంపేరిటో సొంతం చేసుకోవాలనుకోవడం అవివేకం. పైన చెప్పిన వారిలో అగ్రగణ్యులు డాక్టర్ అంబేద్కర్. ఆయన రాసిన రాజ్యాంగాన్నే ఇప్పటికీ మనం అనుసరిస్తున్నారం. ఏదైనా మార్పులు కావలిస్తే మార్చుకుంటున్నా, అందులో ఆత్మ మాత్రం ఆయనదే. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల్లో విబేధాలు ఉండొచ్చు కానీ, వాటికి ప్రత్యామ్నాయం సూచించగల మేధావులు మాత్రం ప్రస్తుతం లేరు. అందుకే రాజ్యాంగరచనలో అంబేద్కర్ విజన్ కి తిరుగులేదంటారు. ఐతే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలు అంబేద్కర్ ను ఓ వర్గానికే పరిమితం చేసే కుట్ర జరుగుతోంది. కానీ పైకి మాత్రం అంబేద్కర్ నామస్మరణ చేస్తూ ఆయన ప్రాతినిధ్యం వహించిన వర్గాల ఓట్లపై గురి పెడుతున్నారంటారు. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ సూసైడ్ అంశం కానీ, జేఎన్ యూలో కన్హయ్య వివాదం కానీ మనుస్మృతి వర్సెస్ అంబేద్కర్ భావజాలం గా చూపేందుకు ప్రయత్నాలు జరిగాయ్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో రిజర్వేషన్లపై చర్చను ఆయనకి వ్యక్తిగతంగా ఆపాదించేవాళ్లూ ఉన్నారు. 

ఇప్పుడు శతజయంతి ఉత్సవాల సమయానికి వచ్చేసరికి పార్టీలు పోటీపడి అంబేద్కర్ ను పొగుడుతున్నాయ్. ముఖ్యంగా స్వాతంత్రం తెచ్చామని చెప్పే కాంగ్రెస్ జాతినేతలను విస్మరించిందని, నెహ్రూ ఇందిరలను తప్ప వేరెవరినీ పట్టించుకోలేదంటూ బిజెపి నేతలు అంబేద్కర్ కి తామే సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పే ప్రయత్నాలు మొదలెట్టారు. దీనికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఎటాకులిస్తూ, నిజమైన అంబేద్కర్ వాదులం తామేనంటూ ఉత్సవాలు ప్రారంభించారు. హైదరాబాద్ లో జరిగిన సదస్సులో కూడా నేతలు ఇదే పని చేశారు. దళితుల పథకాలను తామే తెచ్చామంటూ ప్రసంగాలు చేశారు. ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాల్సిందేంటంటే దళితుల ప్రస్తావన తీసుకురావడానికి అంబేద్కర్ కు సంబంధం లేదు. ఆయన జాతి అంతటికీ నేత. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో 125 అడుగుల విగ్రహాలు నెలకొల్పుతామని చెప్పారు. ఇది ఓ స్ఫూర్తిగా పనికి వస్తుందని వాళ్ల అభిప్రాయం. ఐతే పైకి ఏం చెప్తున్నా, విగ్రహాలు నెలకొల్పితేనో అంబేద్కర్ వాదాన్ని విన్పించినట్లు కాదు. ఉత్సవాలను ఘనంగా జరుపుతామని పోటా పోటీ ప్రకటనల వెనుక రాజకీయ లబ్ది కోసం తపనే ఉందంటారు.
Today Ambedkar 100th Birthday. To celebrate all party leaders are show interest. But now a days, politicians are using Ambedkar name for politics.