కసితో పులి కాంబినేషన్

28 Apr 2016


సర్దార్ గబ్బర్ సింగ్ ఇచ్చిన షాక్ నుంచి పవన్ కల్యాణ్  త్వరగానే తేరుకున్నట్లున్నాడు, అందుకే సినిమా రిలీజై ఇరవైరోజులు కూడా కాకుండానే శరత్ మరార్ కే మరో ఛాన్సిచ్చాడు. నార్త్ స్టార్ ప్రొడక్షన్  హౌస్ లో వచ్చే ఈ సినిమాకి డైరక్టర్ ఎస్ జే సూర్య కావడమే విశేషం. ఖుషీ హిట్ తర్వాత దాదాపు పదిహేనేళ్లకు పులి పేరుతో ఓ భారీ బండ పడేసిన సూర్యకి పవన్ కల్యాణ్ మళ్లీ ఛాన్సివ్వడం సాహసమే అని చెప్పాలి. ఐతే ఈ సినిమాకి స్టోరీ మాటలు రాస్తుంది ఆకులశివ అట, ఈయన ఒకటో నంబర్ కుర్రాడికి డైరక్షన్ చేసిన హిస్టరీ ఉంది.

అలానే శ్రీహరి తో కూడా ఓ సినిమా చేసిన ఎక్స్ పీరియెన్స్ ఉంది. అలాంటి శివ అలియాస్ శివకుమార్ కి పవన్ కల్యాణ్ మరో ఛాన్సివ్వడం సామాజిక వర్గ కోణంలోనే జరిగిందంటున్నారు. బాగా డిప్ప కటింగ్ కొట్టించి కొత్త లుక్ తో కన్పిస్తున్న పవన్ ఈ ఓపెనింగ్ కి అడ్డపంచతో రావడం విశేషం. దర్శకుడు సూర్య మాత్రం కాజువల్ లుక్ తో కన్పించాడు. మిగిలిన క్రూని ఇంకా ఫిక్స్ చేయలేదని చెప్తున్నా, దాదాపుగా పవన్ టీమే మిగిలిన శాఖలు చూసుకుంటాయని టాక్.
Pavan Kalyan Movie Sardaar released recently and got mixed talk. Now he is doing a movie in the direction of S.J.Surya.