కేసీఆర్ డౌన్ డౌన్

1 Apr 2016


పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ తెగ బిల్డప్ ఇచ్చిన కేసీఆర్, అన్నీ అవాస్తవాలే చెప్పుకొచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అసలు ఆయనేదో కొత్తగా ప్రాజెక్టులు కడతామని చెప్తున్నారు కానీ, అంత సీన్ లేదని అవన్నీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టినవే అని క్లారిటీ ఇచ్చేశారు కూడా. అసలు కోటి ఎకరాలకు నీరివ్వడం కేసీఆర్ తరం కాదని, అదంతా వైఎస్ హయాంలో చేపట్టిన జలయజ్ఞం తాలుకూ ఫలాలే అని చెప్పొచ్చారు.
అంతకుముందు పట్టిసీమ ప్రాజెక్టు ఎలా కడతారంటూ అడిగిన కేసీఆర్, ప్రజెంటేషన్ లో పట్టిసీమ ప్రాజక్టు గురించి ఎందుకు ప్రస్తావించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి లాజిక్ లాగారు.

ఇలా అనడం వెనుక చంద్రబాబుతో లాలూచీ పడ్డారేమోనంటూ డౌట్ పడ్డారు పొంగులేటి, ఆడలేక మద్దెల ఓడులా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ పై ఇప్పుడు కేసీఆర్ ఆరోపణలు చేయడం సరికాదని కూడా సూచించాడాయన. ఓ రకంగా కాంగ్రెస్ నేతల విమర్శల్లో పస ఉన్నదనే చెప్పాలి. ఎందుకంటే సమాధానం చెప్పలేనివారిని సమాధానం చెప్పడానికి లేనివారిపై బురద జల్లడం  ఇప్పటిది కాదు. కేసీఆర్ కి మొదట్నుంచీ అలవాటే అని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ మరోసారి ప్రూవ్ చేసింది. ఆయన ప్రసంగం చూసి ప్రతీ వాళ్లూ కేసీఆర్ సారు ఎంత గొప్ప మేధావి, ఎంత గొప్ప ధీరుడని చెప్పుకోవడానికే అవకాశం తప్ప నిజంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఒరిగిందేమిటో తెలీదు.
Telangana CM KCR power point presentation created sensation in all opponent parties. He is telling we will give water to one crore agriculture land.