ముస్తాబవుతోంది

20 Apr 2016


ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవానికి సిధ్దమవుతున్నాడు. తిరుమల బ్రహ్మోత్సవాలకు భక్తులు ఏ స్థాయిలో కిక్కిరిసిపోతారో, ..అదే స్థాయిలో మహేష్ బాబు సినిమాలకు ఓపెనింగ్స్ ఉంటాయ్. ఈ మాట కొత్తగా చెప్పక్కర్లేదనుకోండి. ఐతే మహేష్ ఇప్పుడు శ్రీకాంత్ దర్శకత్వంలో రెండోసారి చేయడమే ఈ సినిమా స్పెషాల్టీ, వరసగా ఫ్యామిలీ కథలకే ఓటేస్తున్న మహేష్, ఈ సినిమాలో మరింత మెరిసిపోతూ కన్పిస్తున్నాడు. 41 ఏళ్లు వస్తున్నా వయస్సును పాతికేళ్ల దగ్గరే ఆపేసిన మహేష్, రీసెంట్ మూవీ బ్రహ్మోత్సవానికి ఇక ఒక్క పాటే బ్యాలెన్స్అట. 

బ్రహ్మోత్సవం సినిమా టైటిల్ కి తగ్గట్లే సెంటిమెంట్ లా, తిరుమల తిరుపతిలోనే ఆడియో వేడుక చేస్తారంటున్నారు. అలా సినిమాని సూపర్ స్టార్ బర్త్ డేకి రిలీజ్ చేయొచ్చనేది ఫ్యాన్స్ అంచనా. ఐతే అంతకు ముందే సినిమా విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. ఎటూ సమ్మర్ వేడి, ఐపీఎల్ జోరు అప్పటికి తగ్గుతాయి కాబట్టి సక్సెస్ కి అన్నీ కలిసొచ్చే డేట్ ఫిక్స్ చేసుకుంటారని అంటున్నారు.
Total Mahesh Babu fans are waiting for Bhramostavam movie release. Only one song is balance is for this movie. This movie audio release date is already fixed.