ఒలింపిక్ జ్యోతి వెలిగింది

22 Apr 2016


రియో డీ జెనిరో లో ఒలింపిక్స్ కి కౌంట్ డౌన్ గా ఒలింపిక్ టార్చ్ వెలిగించారు. గ్రీక్ జిమ్మాస్ట్ ఎలిఫ్ త్రోస్ పెట్రోనస్ ఈ టార్చ్ అందుకుని, రన్ ప్రారంభించారు. కన్నుల పండుగగా ప్రాచీన ఒలింపియా ప్రాంగణంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి 2500 మంది క్రీడాకారులు, నృత్యకళాకారులు హాజరయ్యారు. బ్రెజిల్‌లో జరగనున్న రియో డి జెనీరియో ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కన్నుల పండుగగా సంప్రదాయరీతిలో సాగింది. గ్రీక్‌ నటి కటెరినా లెహో  మొదట ఒలింపిక్ టార్చ్ లో జ్యోతిని ప్రజ్వలింపజేసి  జిమ్నాస్ట్ ఎలిఫ్ త్రోస్ పెట్రోనస్  చేతిలోని మరో టార్చ్ ను వెలిగించారు.

కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల నృత్యాలు ప్రాచీన కళను ప్రతిబింబింపజేస్తూ సాగాయ్. దాదాపు 2వేల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న హేరా  ఆలయంలో ఒలింపిక్ జ్యోతి ని వెలిగించారు. ఇక్కడ ఆరాధ్యదైవమైన అపోలో గ్రహానికి పూజలు చేసి తమ కార్యక్రమం ప్రారంభించడం ఆనవాయితీ. ఆకాశం నుంచి వచ్చే సూర్యకిరణాలు అద్దంపై పడి, దాన్ని పరావర్తనం చెందిస్తారు అలా వచ్చి పడే కిరణాలనుంచి అగ్గి పుడుతుంది, అలా ఒలింపిక్  టార్చ్ లో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది.

బ్రెజిల్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితితో సంబంధం లేకుండా సౌత్ అమెరికన్  ప్రాంతంలో జరుగుతున్న మొదటి ఒలింపిక్స్ కావడంపై ఈ క్రీడల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలానే ఒలింపియా ప్రాంగణంలో మొదలైన ఈ టార్చ్ ఏథెన్స్ కి సాగి అక్కడ కూడా భారీ ఎత్తున జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం సాగింది. ఒలింపియాలో ప్రారంభమైన ఈ టార్చ్ రిలే, ఏప్రిల్ 27న బ్రెజిల్ రియో ఒలింపిక్ కమిటీకి చేరుతుంది. ఈ టార్చ్ రిలేలో 12 వేల మంది క్రీడాకారులు జ్యోతిని వివిధ దేశాలకు తీసుకెళ్తారు. ఈ ఏడాది ఆగస్ట్ 5 నుంచి 21 వరకూ ఒలింపిక్స్ జరగనున్న నేపధ్యంలో టార్చ్ రిలేతో కౌంట్ డౌన్ ప్రారంభమైనట్లే.
Olympic fire is started in Hera temple. This year Olympic will be host by Brazil. So this fire will reach to Brazil to this year august.