మహేష్ పై మనసు పారేసుకున్న జూలీ

1 Apr 2016


ప్రిన్స్ మహేష్ సరసన నటించాలని కోరుకోని హీరోయిన్ ఉండరేమో అన్పిస్తుంది. అప్పుడెప్పుడో జూలీ గా బాలీవుడ్ లో సెన్సేషన్ కలిగించిన మిస్ ఇండియా నేహాధూపియా సిటీకి వచ్చింది. తెలుగులో మరో ఛాన్స్ వస్తే మహేష్ బాబు పక్కన నటించాలని ఉందంటూ మనసులో మాట బైటపెట్టింది. ఐతే అదంత ఈజీ కాదిప్పుడు ఎందుకంటే, ఆమె ఒకప్పుడు ఉన్న బాడీ వేరు, ఇప్పుడు వేరు బాగా బొద్దుగా మారిపోయి విద్యా బాలన్, నిత్యమీనన్ సైజుకి మారిన నేహా మరీ ముచ్చట పడితే ఓ ఐటెమ్ సాంగ్ ఏమైనా ఛాన్సివచ్చు మహీ నేహాకి..!

ఏరియల్ వాషింగ్ పౌడర్ కంపెనీ స్టార్ట్ చేసిన డాడ్స్ షేర్ ద లోడ్ ప్రోగ్రామ్ కి నేహా ధుపియా తండ్రి ప్రదీప్ ధూపియాతో కలిసి వచ్చింది. ఇక్కడే మాట్లాడని నేహా ఫ్యామిలీలో బట్టలు ఉతకడం వంటి పనులు తల్లి మాత్రమే చేయాలంటే కుదరదని. తండ్రి కాకుంటే ఇంట్లో మరో మగవాళ్లెవరైనా చేయాలని పిలుపు ఇచ్చింది. ఇదే సందర్భంలో తన ఫ్యామిలీ డీటైల్స్ కూడా వివరించింది నేహా. ప్రస్తుతానికి రోడీస్ అనే టీవీ రియాల్టీ షో చేస్తున్న నేహా శాంతా బంతా అనే రొమాంటిక్ కామెడీ, మాయా అనే థ్రిల్లర్ మూవీ చేస్తోందట. బహుశా ఈ మాయ నయనతార చేసిన మాయకి రీమేక్ అని అంటున్నారు.
Mahesh Babu Adhiti movie heroin, Bollywood star Neha Dhupia recently appeared in Hyderabad. She share her feeling with media. I want to act with Mahesh Babu and now i am doing two movies.