నయనతార బంగారం

13 Apr 2016


రెండున్నరేళ్లుగా తెలుగు తెరపై కన్పించడం మానేసినా, డబ్బింగ్ మూవీస్ తో పాటు టీవీల్లో పలకరిస్తున్న నయనతార మరోసారి తెలుగు ఆడియెన్స్ ని  అలరించబోతోంది. తనకి అచ్చొచ్చిన హీరో వెంకీతో ముచ్చటగా మూడోసారి ఈ జులై లో జనం ముందుకు రాబోతోంది నయన్. డబుల్ మీనింగ్ డైలాగుల మారుతి దర్శకత్వంలో వెంకీ హీరోగా వస్తున్న బాబు బంగారంలో నయన్ పార్ట్ షూటింగ్ పూర్తైందట, ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ అవగా సినిమా సమ్మర్  ఎండ్ కి వస్తుందని అంటున్నారు.

లక్ష్మి, తులసి తర్వాత వస్తున్న బాబు బంగారం వెంకటేష్ , నయనతార కాంబినేషన్ సక్సెస్ కి హ్యాట్రిక్ అవుతుందని వెంకీ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. భలేభలే మగాడివోయ్ యావరేజ్ గా పోవడంతో, మారుతి దర్శకత్వానికి మంచి మార్కులతో పాటు, నెక్స్ట్ సినిమా అయిన బాబు బంగారంపై కూడా మంచి అంచనాలున్నాయ్. ఈ రెండు సెంటిమెంట్లు వర్కౌట్ అయితే చాలు సినిమా సక్సెస్ ట్రాక్ లో పడుతుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.
Tollywood experimental heroin Nayanathara, took long to Tollywood. Now she is doing a movie with Venkatesh in Maruthis direction.