సవాల్ కాస్కో

1 Apr 2016


మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి గుర్తున్నారా..? ఆయన ప్రస్తుతానికి బిజెపిలో ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారాయన. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చెప్పినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులను 30 నెలల్లో పూర్తి చేయడం కుదరదని కుండ బద్దలు కొట్టాడాయన, అంతే కాదు అలా పూర్తి చేయగలిగితే తాను గుండు కొట్టించుకుంటానంటూ సవాల్ విసిరారు. అసలు నాగం జనార్ధనరెడ్డికి జనం ఎప్పుడో గుండు కొట్టేసారు. అదీ కాకుండా నాగం జనార్ధనరెడ్డి నెత్తిపై కనీసం పది వెంట్రుకలు కూడా లేవ్, అలాంటి బట్టతల నాగం ఇప్పుడు గుండు కొట్టించుకుంటాననడం కామెడీ కాక మరేంటి..? ఇప్పుడు మేం అనేది రేపో ఎల్లుండో, టిఆర్ఎస్ నేతలు అంటారు సరిపోతుంది అప్పుడు నాగంకి.

ఓ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే కనీసం 2 ఏళ్లు పడుతున్న కాలమిది. అందులో భారీ ప్రాజెక్టులకు సమయం పెట్టుకోవడానికి ఓ డెడ్ లైన్ అంటారు కానీ. అవి ఆ టైమ్ కి పూర్తైన దాఖలాలు లేవు. దాన్ని సాకుగా తీసుకుని సిఎం కేసీఆర్ పై రెండున్నరేళ్లలో పూర్తి చేయాలంటూ సవాల్ విసరడం, రాజకీయ అవకాశవాదమే అవుతుంది. ఐతే ఇందులో కేసీఆర్ చిత్తశుధ్దిని, నిలకడలేమిపై ఎన్నైనా సెటైర్లు వేయవచ్చు కానీ టైమ్ ని సాకుగా పెడితే అది అంత వాదనకు నిలబడదు. ఎందుకంటే ఆయనే స్వయంగా 2019 కి ప్రతి ఇంటికి నల్లానీరు రాకపోతే ఓట్లడగం, రాళ్లెట్టి కొట్టండంటూ పిలుపు ఇచ్చాడు కదా అప్పటిదాకా   ఆగండి నాగంజీ..!
Ex minister and present BJP leader Nagam Janardana Reddy commented on KCR power point presentation. He is telling it is not to possible to complete projects with in two years.