పోకిరీలకు వార్నింగ్

14 Apr 2016


ముంబైలో బార్ గాళ్స్ తో అసభ్యంగా ప్రవర్తించే వారికి ఓ హెచ్చరిక ఇక ఎలాంటి సంకేతాలు చేసినా, చీప్ గా బిహేవ్ చేసినా కఠినంగా శిక్షించేలా బిల్ ఒకటి పాసైంది. డాన్స్‌ బార్‌ నియంత్రణ' బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర మంత్రి రామ్‌షిండే అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం బార్‌లో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన, అశ్లీలత కార్యక్రమాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆకతాయిలతో పాటు ఇలాంటి వేషాలు వేస్తే చూస్తూ ఉన్న బార్ యజమానులకు కూడా జరిమానా విధిస్తారు.

ఐదేళ్ల  జైలు శిక్ష కూడా వేసే  అవకాశం కొత్త బిల్ వీలుకల్పించింది. అలానే విద్యాసంస్థలు, దేవాలయాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో బార్లను ఏర్పాటు చేసేలా ఈ బిల్లులో నిబంధలను పొందుప రిచారు. బార్లను ఈవెనింగ్ సిక్స్ నుంచి లెవన్ వరకూ మాత్రమే రన్నయ్యేలా నిబంధన విధించారు బార్ గాళ్స్ కి సేఫ్టీ ఉండాలని ముంబై హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.
Mumbai Assembly passed a bill about bar girls. Who mis behave with Bar Girls will punish seviourly.