రాజధాని భవనాల డబ్బు ఇలా ఖర్చు చేశారా

11 Apr 2016


ఎపి రాజధాని లో భవనాల నిర్మాణానికి ఇచ్చిన నిధులు 850 కోట్ల రూపాయలను ఖర్చుచేశామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిందన్న వార్త ఒకింత ఆశ్చర్యంగానే కనిపిస్తుంది. ఒక పక్క తాత్కాలిక రాజధాని కోసం 200కోట్ల రూపాయల టెండర్ ను ఆమోదించి పనులు చేపట్టిన ప్రభుత్వం ,మొత్తం నిదులు ఖర్చు అయినట్లు పంపించడం విశేషమే. అయితే భూ సమీకరణ పరిహారం, పెన్షన్లు, కన్సల్టెంట్ల కు ఇచ్చిన నిధులు,మాస్టర్ ప్లాన్ తయారీకి సుర్బానాకు పదిహను కోట్లు మొదలైనవి లెక్కలలో చూపారని ఆ కధనం చెబుతోంది. 

రాజధాని భవనాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర అవసరాలకు వాడుకున్న ప్రభుత్వం ,కేంద్రం సూచన మేరకు వినియోగ పత్రాలు పంపవలసి ఉండగా , ఈ లెక్కలు తయారుచేసి పంపిందని చెబుతున్నారు.విశేషం ఏమిటంటే మాస్టర్ ప్లాన్ తయారీ సింగపూర్ దేశం ఉచితంగా చేసిందని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.మరి లెక్కలలో పదిహేను కోట్లు చూపుతున్నారు.భూ సమీకరణకు 350 కోటల వ్యయం చేసినట్లు తెలిపారని సమాచారం.ప్రభుత్వాలే ఇలా ఏదో ఒక లెక్క ఇచ్చి చిత్తశుద్ది లేకుండా వ్యవహరిస్తే నైతికంగా దెబ్బతినడం లేదా!
In Andhrapradesh temparary capital works are going very speed. For capital central government is saying we have given 850cr. CM miss using this money.