బ్యాన్ ఆన్ దట్.. ఫర్ బెటర్ సొసైటీ..

3 Apr 2016


మీడియాలో ప్రమాణాలు పడిపోయాయని అందరూ గగ్గోలెడుతుంటారు. ఐతే అదేదో     ఒక్క ఆరంగంలోనే కాదు, టోటల్ వ్యవస్థలోని వ్యక్తుల్లోనే విలువలు తగ్గాయి. ఇది కాలధర్మం అని సరిపెట్టుకోవాల్సిందే మరి కానీ మెరుగైన సమాజం కోసం తమ మురుగునంతా నింపేసే  ఓ ఛానల్ తమకి మైక్ ఉంది కదా ఏమడిగినా, అడ్డుకునేవాళ్లు లేరనుకుంటూ ఎలాంటిప్రశ్నలేస్తోందో తెలుసా..? మీరు బ్లూ ఫిల్మ్స్ లో నటించారా.. ఇదీ ఓ వెటకారపు వంకరబుద్ది యాంకర్ అడిగే ప్రశ్న, అసలు వాళ్లింట్లో ఆడవారిని ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఏం చేస్తారో అదే రోజా కూడా చేయాల్సింది.

ఇష్టం వచ్చినట్లు అడిగి, అక్కడికి తానేదో తెగ అద్భుతమైన పరమార్ధమున్న ప్రశ్న అడిగినట్లు అవతలివాళ్లని ఇరుకున బెట్టినట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ నవ్వడం వాళ్లకే చేతనవుతోంది. అందుకే కొన్ని చోట్లు విలేకర్లపై దాడులు జరుగుతున్నాయ్. ఇలాంటి సన్నాసి డాష్ గాళ్లకు ఉద్యోగాలనిచ్చిన వెధవాయలను అనాలి. ఓ ప్రశ్న అడగటంతో మన గొప్పదనం బైటపడుతుందని మురుగు టీవీ ఆలోచన కాబోలు, పైగా జర్నలిజానికి కొత్త నిర్వచనాలు ఇవ్వడంలోనూ ఇదే ముందుంటుంది. ఇలా ఎమ్మెల్యే రోజాని పట్టుకుని ఇలాంటి ప్రశ్న అడిగారంటే ఆ ఛానల్ కి మనుషులంటే ఎలాంటి విలువ ఇస్తుందో అర్ధమవుతోంది.
Now a days medias are crossing their limits for their rating. Recently a media which is telling as a big channel, asked bad question to Roja.