నై సూరా..మజాకా

28 Apr 2016


ఈ మధ్యకాలంలో అస్సలు కన్పించకుండా పోయిన మైసూరారెడ్డి కూడా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశార(ట). అదే విషయం జగన్ కూడా ఢిల్లీలో కామెంటే్ చేశారు. మైసూరా అన్నని చూసి ఆర్నెల్లు అయిుంది, అని కామెంట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి, మైసూరారెడ్డి వైఖరిపై ఎంత విసుగుతో ఉన్నారనడానికి నిదర్శనం. జగన్ ఓ అపరిచితుడుగా మారిపోయాడంటున్న మైసూరా బహుశా తనకి రాజ్యసభ పదవి కట్టబెట్టే అవకాశం లేదు కాబట్టే, ఇలా అంటున్నాడని టాక్.

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి చెప్తున్నదాని ప్రకారం మైసూరారెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలకు అనుమతులు, బ్యాంక్ క్లియరెన్సులు చంద్రబాబు ఇప్పిస్తారని అందుకే ఆయన ఈ జంప్ పురాణం విప్పుతున్నారని అంటున్నారు. పైగా కొత్తగా రాయలసీమ ఉద్యమానికి వైసీపీ మద్దతు ఇవ్వడం లేదంటున్న మైసూరా దాన్ని మూడుసార్లు వాయిదా ఎందుకు వేసారో కూడా ప్రజలకు చెప్పాలి. అది ఎందుకలా అయిందో చెప్పమని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఏదెలా ఉన్నా మైసూరారెడ్డి చెప్పిన సమయం వస్తుంది. అది సరైన నిర్ణయం కూడా ఎప్పుడవుతుందంటే అది టిడిపిలోనే చేరినప్పుడు అని కూడా  అప్పుడే జోకులు కూడా పేల్తున్నాయ్.
YSRCP opponent leader Maisura Reddy is getting ready to jump into TDP. Recently in Delhi YS Jagan comment on him. To get permissions for his cement factories, he is joining into TDP.